breaking news
kenya woman
-
72 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని..
నైరోబీ: కెన్యా పర్యావరణ ఉద్యమకారిణి ట్రంఫెనా ముతోని ప్రపంచ రికార్డు సృష్టించారు. నిద్రాహారాలు మాని 72 గంటలపాటు ఒక చెట్టును కౌగిలించుకుని ఉండిపోయారు. గతంలో 48 గంటల పాటు చెట్టును కౌగిలించుకుని తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టారు. నౌరీ పట్టణంలోని ఓ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో చెట్టును ఆమె ఇందుకు ఎంచుకున్నారు. అడవుల నరికివేత, మృగాల హత్యలకు నిరసనగా, యువతకు పర్యావరణ సంరక్షణ విలువను తెలపడానికి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఆమె నిరసనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచి్చంది. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో ఆమె నిద్రలోకి జారుకోగా.. మద్దతుదారులు మేల్కొలిపారు. కొందరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పరిశీలకులకు ఆమె ఫీజు చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ సమయంలో ఆమె నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగుల్లో ఉన్న ఊలు టీషర్ట్‌ను ధరించారు. నలుపు ఆఫ్రికన్ శక్తని, ఆకుపచ్చ అడవులకు, ఆశకు ప్రతిరూమని, ఇక ఎరుపు ప్రతిఘటనకు, నీలం నీటికి గుర్తని.. చెప్పారు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచడమే తన నిరసన లక్ష్యమని చెప్పారు. తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే తమ దేశాలు.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని ఆఫ్రికన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. -
కెన్యా మహిళది తప్పుడు ఫిర్యాదు...
నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో కెన్యాకు చెందిన మహిళపై ఫిర్యాదు ఒట్టిదేనని తేలిందని పోలీసులు తెలిపారు. ఆమెపై దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నొయిడా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మేంద్రయాదవ్ తెలిపారు. గ్రేటర్ నొయిడా ప్రాంతంలో కెన్యాకు చెందిన ఓ మహిళపై దాడి జరిగిందంటూ రెండు రోజుల క్రితం కొందరు ఆఫ్రికన్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వెళ్తున్న ఒలా క్యాబ్‌ను అడ్డగించిన దుండగులు ఆమెను బయటకు లాగి కొట్టారని అందులో పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు ఆమె ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పింటూను అదుపులోకి తీసుకుని విచారించగా .. ఎలాంటి దాడి జరగలేదని పేర్కొన్నాడు. అంతేకాదు, బాధితురాలు చెబుతున్నట్లుగా ఆ సమయంలో ఎలాంటి గొడవలు ఆప్రాంతంలో చోటుచేసుకోలేదని సమీపంలోనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. సీసీఫుటేజిలోనూ దాడి జరిగిన ఆనవాళ్లు లేవు. దాడి ఘటన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం స్పందించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. దీంతో మరింత దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితురాలు చికిత్స పొందినట్లుగా చెబుతున్న రెండు ఆస్పత్రుల్లోనూ వివరాలు సేకరించారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని, దెబ్బలు తగల్లేదని వైద్యులు వెల్లడించారు. వీటన్నిటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. బహుశా.. బాధితురాలు స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో జరిగిన ఘర్షణతో ఈ విధమైన ఫిర్యాదు చేసి ఉంటుందని భావిసు్తన్నట్లు అందులో వివరించారు. ఇదే విషయాన్ని కెన్యా రాయబార కార్యాలయం అధికారులకు వివరించామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మేంద్రయాదవ్ తెలిపారు. ఆఫ్రికన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చార్లెస్ మాట్లాడుతూ.. కెన్యా మహిళ తప్పుడు ఫిర్యాదు చేసిందని రుజువైందని, పోలీసులు తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారని వివరించారు.


