15 ఏళ్ల బాలికపై 38 మంది సామూహిక రేప్
డ్రగ్స్ ముఠాకు చెందిన పాడుపడ్డ గుడిసె... ఒంటరిగా15 ఏళ్ల అమ్మాయి... అంతే ....ముష్కరులు రెచ్చిపోయారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా 38 మంది ఒకరి తరువాత మరొకరు ఆమెను రేప్ చేశారు. ఈ కిరాతకం కొన్ని గంటలపాటు కొనసాగింది.
ఈ ఘాతుకం మలేషియాలోని కెలాంటన్ ప్రాంతంలో జరిగింది. అమ్మాయి దారి తప్పి అడవిలోని ఆ గుడిసెకు చేరుకుంది. అక్కడ ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు పోలీసులు హడావిడిగా ముష్కరుల్ని పట్టుకుంటున్నారు. 13 మందిని అరెస్టు చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. దొరికిన వారిని పరీక్షిస్తే వారి రక్తం, మూత్రంలో మాదక పదార్థం ఆంఫిటమిన్ ఉన్నట్టు తేలింది. అరెస్టయిన వారిలో ఒక తండ్రి, ఆయన పుత్రరత్నాలు ఇద్దరు కూడా ఉన్నారు.
విషాదం ఏమిటంటే ఈ ఘాతుకం జరుగుతున్న చోటకు కేవలం 20 అడుగుల దూరంలో ఇతర గుడిసెలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మే చివరి వారం మహిళల పట్ల ఘోరాలను నమోదు చేసింది. తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టి పెళ్లి చేసుకున్న యువతిని పోలీసుల ముందే కాల్చి చంపిన ఘటన పాకిస్తాన్ లో జరిగింది. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు దళిత యువతులను పోలీసులే రేప్ చేశారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మలేషియాలో ఈ ఘోరం నమోదైంది.