breaking news
Kaveri water dispute
-
పునీత్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా!
Why Tamil Heros Not Attend Puneeth Rajkumar Funerals: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేస్తుంది. పేరుకు కన్నడ హీరో అయినా అందరితో ఎంతో సత్సంబంధాలు కొనసాగించేవారు. పునీత్ ఇకలేరని తెలిసి కన్నడ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. చదవండి: పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్ ఇక పునీత్ అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు సహా టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్కరు కూడా హాజరుకాలేదు. నిజానికి విశాల్, సూర్య, విజయ్ వంటి హీరోలతో పునీత్‌కి మంచి స్నేహం ఉంది. అయినా వాళ్లు కడసారి చూపుకు రాలేదు. దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. ఆ మధ్య తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు హాజరు కాలేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి:నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం -
కావేరీ వివాదం : బంద్‌తో తమిళనాట టెన్షన్
సాక్షి, చెన్నై: కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటులో కేంద్రం వైఫల్యాన్ని నిరసిస్తూ డీఎంకే పిలుపు మేరకు గురువారం తమిళనాడులో బంద్ కొనసాగుతోంది. రోడ్డు, రైల్ ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడటంతో జనజీవనం స్థంభించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు మిన్నంటాయి. అన్నా సలై, కొడంబాక్కం, నంగంబాక్కం తదితర ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శనలతో హోర్తెతించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు సర్వీసులపై బంద్ ప్రభావం కనిపించింది. హోసూర్, తిరుచ్చిలోనూ బస్సుల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేఎస్ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను కూడా పలు చోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిరసనలతో తమిళనాడు నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బంద్ నేపథ్యంలో స్ధానిక వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎంకే బంద్ పిలుపునకు రైతులు, వ్యాపారులు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. చెన్నైలోని మౌంట్ రోడ్డులో ప్రతినక్ష నేత స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆందోళనలో వీసీకే, ఎండిఎంకె, వామపక్షాలు పాల్గొనటంతో నగరం స్తంభించింది. వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలతో మౌంట్ రోడ్డు జనసంద్రమైంది. ర్యాలీగా ఆందోళనలతో ముందుకు సాగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్, వైగో, తిరుమావళవన్, వామపక్ష నేతలను అరెస్టు చేసి స్థానిక పోలీస్టేషన్లకు తరలించారు. ఇక వేలూరు, పుదుచ్చేరిలో బంద్ హింసాత్మకంగా మారింది. బస్సుల ధ్వంసం ఆందోళనకారులు ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేయగా పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పంటించటం ఉద్రిక్తతకు దారితీసింది. పుదుచ్చేరి, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఆరు బస్సులను ఆందోళనకారులు ద్వంసం చేశారు.వేలూరులో ఆందోళనకారుల ఆగ్రహానికి 15 బస్సులు ద్వంసమయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులను ఆందోళన కారులు ద్వంసం చేయటం గమనార్హం. పలుజిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగినా, వేలూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. -
‘కావేరి’ రగడ!
* కర్ణాటకలో రెండు కొత్త డ్యాంలు * అడ్డుకట్ట కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం * అఖిలపక్షానికి కరుణ పిలుపు సాక్షి, చెన్నై: కావేరి జల వివాదం తమిళనాడు, కర్ణాటకల మధ్య మళ్లీ తాండవం చేయబోతున్నది. తమిళనాడుకు వచ్చే నీటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ర్టంలో రెండు కొత్త డ్యాంలకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తక్షణం అసెంబ్లీ సమావేశానికి, అఖిల పక్షానికి చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావేరి జల వివాదం కర్ణాటక, తమిళనాడుల మధ్య కొత్తేమీ కాదు. ఈ వివాదం ప్రతి ఏటా జఠిలం అవుతూనే ఉంది. ఈ వివాదం పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ సైతం తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కావేరి నదీ జలాల మీద ఆధార పడ్డ డెల్టా జిల్లా అన్నదాతలు ఆనందంలో మునిగారు. అయితే, ఆ తీర్పును ధిక్కరించే రీతిలో కర్ణాటక సర్కారు, తీర్పును అమలు చేయించలేని పరిస్థితుల్లో కేంద్ర పాలకులు ఉండడం డెల్టా అన్నదాత పాలిట శాపంగా మారింది. కావేరి నదీ జలాల్ని సక్రమంగా విడుదల చేయని కర్ణాటక సర్కారు, వర్షాల రూపంలో వచ్చే ఉబరి నీటిని సైతం అడ్డుకునేందుకు రెడీ అయింది. మరో రెండు డ్యాంలు: గతంలో ఓ మారు కర్ణాటకలో విస్తారంగానే వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణ రాజ సాగర్, కబిని డ్యాంలు నిండే స్థాయికి చేరడంతో ఆ నీళ్లు ఉబరి నీళ్లుగా తమిళనాడులోని మెట్టూరు డ్యాంకు చేరాయి. అయితే, తమిళనాడు మీద కన్నెర్ర చేసిన కర్ణాటక పాలకులు ఆ ఉబరి నీటిని అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నించారు. దీనిని అప్పటి డీఎంకే సర్కారు గట్టిగానే తిప్పి కొట్టింది. ప్రస్తుతం అదే బాటలో మళ్లీ పయనించే పనిలో కర్ణాటక సర్కారు నిమగ్నం అయింది. రెండేళ్లుగా నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు కర్ణాటకను కరుణిస్తుండడంతో, ఉబరి నీరు కావేరి నదిలో పరవళ్లు తొక్కుతూ తమిళనాడుకు వచ్చి చేరుతున్నాయి. ఆ నీరు మెట్టూరు డ్యాంకు చేరినప్పుడు మాత్రం నీటి సమస్య తీరడం, మిగిలిన సమయాల్లో జల సం కటం ఎదుర్కొనడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వర్షాకాలంలో తమిళనాడుకు ఉబరి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోవడానికి మేఘదాత్తు వద్ద రెండు డ్యాంల నిర్మాణానికి పరిశీలన పూర్తి చేసి, అందుకు తగ్గ చర్యల్లో కర్ణాటక నిమగ్నం కావడం మళ్లీ రెండు రాష్ట్రా ల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయింది. కర్ణాటక ఎత్తులతో షాక్: ఓ వైపు కేరళ వైఖరిపై తమిళనాడులోని దక్షిణాది జిల్లాల అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్లై పెరియార్ నీటి మట్టం పెంపు, పాంబన్ నీళ్లు అమరావతిలోకి రానివ్వకుండా చేయడం కోసం ఆ తీరంలో ఓ డ్యాం నిర్మాణానికి కేరళ చర్యలు చేపట్టడం అక్కడి అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళ బాణిలో కర్ణాటక సైతం తమిళనాడుకు నీళ్లు రాకుండా అడ్డుకునే పనిలో పడడం డెల్టా అన్నదాతల్లో ఆగ్రహ జ్వాలను రగుల్చుతోంది. చాప కింద నీరులా అన్ని చర్యల్ని చేపట్టి డ్యాం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు వేగవంతం చేయడం తమిళనాడు ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఎలాంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సేకరించక పోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది. అఖిల పక్షానికి పిలుపు : కర్ణాటక అధికారిక ప్రకటనతో రెండు రాష్ట్రాల మధ్య ఆగ్రహ జ్వాల రాజుకునే అవకాశాలు అధికం అయ్యా యి. డెల్టా అన్నదాతలు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు డ్యాంలలో 44 టీఎంసీల చొప్పున నీళ్లు నిల్వ ఉంచే విధంగా నిర్మాణాలు సాగబోతుండడంతో ఇక డెల్టా జిల్లాలు కరువు ప్రాంతాలుగా మా రడం ఖాయం అన్న ఆందోళన అన్నదాతల్లో బయలు దేరింది. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటే తక్షణం అఖిల పక్షానికి పిలుపు నివ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశ పరచి ఆ డ్యాంల నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జీకేవాసన్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక చర్యల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. సీఎం సమీక్ష: కర్ణాటక అధికారిక ప్రకటనతో అడ్డుకట్ట లక్ష్యంగా ప్రత్యామ్నాయ కసరత్తుల్లో సీఎం పన్నీరు సెల్వం ము నిగి ఉన్నారు. ఆగమేఘాలపై సచివాలయంలో ఆయ న అధికారులతో సమీక్షించారు. కర్ణాటక చేపట్టదలచి న నిర్మాణాలు, తద్వారా తమిళనాడుకు ఎదురయ్యే సంకట పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీశారు. కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసే పనిలో పడ్డారు. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, తమకు కావేరి మీద ఉన్న హక్కుల్ని వివరి స్తూ, కావేరి పరిరక్షణ కమిటీ, కావేరి అభివృద్ధిబోర్డు ఏర్పాటు నినాదంతో, కర్ణాటక కొత్త డ్యాం ప్రయత్నాలకు అడ్డుకట్ట లక్ష్యంగా ప్రధానికి లేఖాస్త్రం సంధించే పనిలో పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకునే అవకాశాలు కన్పిస్తుండడంతో భద్రతను సరిహద్దుల్లో పెంచారు. కర్ణాటక బస్సులకు భద్రత కల్పించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.