breaking news
kata amrapali
-
ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో
సాక్షి, ఒంగోలు: జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఎన్.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్రపాలి.. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. కుటుంబం అంతా ఉన్నతాధికారులే.. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పని చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. -
ఫ(బె)స్ట్ ఆఫీసర్
ప్రతిభకు మారుపేరు అమ్రపాలి వారానికి ఓ పుస్తకం చదవాల్సిందే చూడకుండానే స్మార్ట్‌ఫోన్ టైపింగ్ మారథాన్‌లో ఉత్తమ ప్రతిభ వరంగల్ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు అమ్రపాలి కాట... వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరు. పేరులాగే కొత్త తరానికి ప్రతినిధి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, నిరంతర శ్రమతో సాధించడం... ఇవే అమ్రపాలికి తెలిసినవి. టెక్నాలజీని బాగా వినియోగించే అమ్రపాలి... అభివృద్ధి కార్యక్రమాల్లో దీన్ని వినియోగించేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు. చారిత్రక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం గొప్ప అవకాశమని చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ అంశాలు ఆమె మాటల్లోనే... మద్రాస్ ఐఐటీలో బీటెక్, బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశా. మొదట ముంబైలో ఆర్బీఎస్ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేశాను. నాకు నచ్చిన పని చేయడంలోనే నాకు ఆనందంగా ఉంది. సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించా. సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్ మెయిన్స్ ఆప్షనల్స్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకొని సివిల్స్ రాశా. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాను. నాది 2010 ఐఏఎస్ బ్యాచ్. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ఫస్ట్ పోస్టింగ్. తర్వాత మహిళా, శిశుసంక్షేమ శాఖ డెరైక్టరుగా పనిచేశా. మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా జారుుంట్ కలెక్టరుగా ఉన్నా. జిల్లాల పునర్విభజనతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వరంగల్ కలెక్టర్‌గా పోస్టింగ్ రావడం గర్వంగా ఫీలవుతున్నా. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పాత్ర విభిన్నమైనది. ఈ జిల్లాకు పోస్టింగ్ రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నగర, గ్రామీణ ప్రాంతాల కలబోతగా అర్బన్ జిల్లా ఉంది. కలెక్టరుగా... అన్ని శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తా. తల్లిదండ్రులే స్ఫూర్తి... జీవితంలో స్ఫూర్తినిచ్చినవారు అమ్మ..న్నాన్నలే. నాకు సంబంధించిన అన్ని అంశాల్లో వారు అండగా నిలిచారు. నన్ను జీవితంలో నిలబడేలా చేశారు. విశాఖపట్నంలోని సత్యసారుు పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ సాగింది. తండ్రి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్, సోషల్ స్టడీస్(సెస్)లో ఎకనామిక్ ప్రొఫెసర్. అమ్మ పద్మావతి ఉన్నత విద్యావంతురాలు, గృహిణి. సోదరి గంగోత్రి చెన్నైలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త తమిళనాడు సర్వీసు ఐఏఎస్ అధికారి. చదువకుండా ఉండను... చదవడం నాకు ఇష్టం. చదవకుండా ఉండలేను. ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. మహాభారత్, ఎస్ మినిస్టర్, ఎస్ ప్రైమ్ మినిస్టర్(కామిక్ బుక్), అగస్టా వంటి ఇంగ్లీషు పుస్తకాలు, నవలలు చదివాను. వారానికి ఒక పుస్తకం చదవాలని 2016 సంవత్సరం ఆరంభంలో గట్టిగా నిర్ణయించుకున్నా. ఇలా ఏడాదిలో 52 పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికి 29 పుస్తకాలు మాత్రమే చదివా. సినిమాలు చూస్తా. హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తా. స్కీన్ర్ చూడకుండానే వ్యాట్సాప్‌లో టైప్ చేస్తా. నడక అంటే ఇష్టం. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, సివిల్స్ శిక్షణలో హాఫ్ మారథాన్‌లో 21 కిలోమీటర్ల పరుగులో గోల్డ్‌మెడల్ సాధించా. బెస్ట్ ఫిమేల్ అథ్లెట్‌గా నిలిచాను. పాఠశాల, కళాశాల స్థారుులో ఎన్నో బహుమతులు పొందాను. హైదరాబాద్‌లో ఆగస్టులో 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తిచేశా. నవంబరులో మరో హాఫ్ మారథాన్ కోసం ప్రయత్నిస్తున్నా. వరంగల్‌లో ఉర్దు నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నా. వీలైనంత సాయం... ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉంది. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగించడంపై దృష్టి పెడతా. మహిళా సాధికరత కోసం అన్ని చర్యలు తీసుకుంటా. ఐఏఎస్ అధికారికి సహనం ఎక్కువగా ఉండాలని భావిస్తా. ప్రజల సమస్యలను, బాధలను ఓపికగా విని అర్ధం చేసుకోవాలి. సమస్యలకు పరిష్కారాలు ఆలోచించి సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి. యువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రయత్నిస్తా. కష్టపడేతత్వం. పారదర్శకంగా పనిచేయడం, సుపరిపాలన అందించడం, అందరికీ న్యాయం... నా పరిధిలో వీలైనంత మేరకు సహాయం చేయడం సంతృప్తినిస్తాయి. ఇప్పటి యువతీయువకులు... ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యసాధన దిశగా నిరంతరం శ్రమించాలి.