breaking news
Kancharla Dharma reddy
-
'తాలిబన్ల కంటే ప్రమాదకారి చంద్రబాబు'
హైదరాబాద్ : తాలిబాన్ ఉగ్రవాదుల కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని తెలంగాణ లోక్సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటుకు కోట్లు కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఏపీలో ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే సెక్షన్-8 అంటూ చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు కుట్రలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
జేపీ ఉగ్రవాది కంటే ప్రమాదకారి: టీ.లోక్సత్తా
హైదరాబాద్: లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఉగ్రవాది కంటే చాలా ప్రమాదకారుడని తెలంగాణ లోక్సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలలో ఆరితేరిన జేపీ యువతను మాయ మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో ఢిల్లీ లోక్సత్తా అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ సంభాషణల ఆధారంగా ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీ మంచివ్యక్తి అనే ముసుగులో దాగి ఉన్న ఒక గజదొంగ అని ఆయన ఆరోపించారు. లోక్సత్తా అనే గజదొంగల పార్టీకి తెర ముందు జేపీ కనిపించినా...తెరవెనుక నడిపించేది మొత్తం ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అని ఆయన పేర్కొన్నారు. తమ సామాజికి వర్గానికి చెందిన చంద్రబాబు ఫెయిల్ అయితే జేపీని తెరపైకి తెచ్చి ఫోకస్ చేయడానికే ఇదంతా రామోజీరావు చేస్తున్న డ్రామా అని ఆయన వివరించారు. విద్యార్థులు, యువత జేపీ మాయ మాటలకు మోసపోవద్దని కంచర్ల విజ్ఞప్తి చేశారు.