'తాలిబన్ల కంటే ప్రమాదకారి చంద్రబాబు' | Telangana Loksatta Party Leader Kancharla Dharma Reddy fires on AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

'తాలిబన్ల కంటే ప్రమాదకారి చంద్రబాబు'

Jun 23 2015 8:20 PM | Updated on Mar 9 2019 4:13 PM

తాలిబాన్ ఉగ్రవాదుల కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని తెలంగాణ లోక్‌సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు.

హైదరాబాద్ :  తాలిబాన్ ఉగ్రవాదుల కంటే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని తెలంగాణ లోక్‌సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటుకు కోట్లు కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఏపీలో ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే సెక్షన్-8 అంటూ చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు కుట్రలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement