Kal Somani
-
మిట్టల్ చేతికి రాజస్తాన్ రాయల్స్.. భారీ ట్విస్ట్!
రాజస్తాన్ రాయల్స్ అమ్మకం విషయంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికా వ్యాపారవేత్త కాల్ సోమాని కన్సార్టియం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో చట్టపరమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.సంచలన ప్రకటనకాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ అమ్మకానికి రాగా.. కాల్ సోమాని కన్సార్టియం దీనిని కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ఆదివారం సంచలన ప్రకటన వచ్చింది. తాము ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు మిట్టల్ కుటుంబం ప్రకటించింది.లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్‌తో రాయల్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో పాటు... వేర్వేరు లీగ్‌ల్లో పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ జట్లు కూడా మిట్టల్ సొంతం అయ్యాయి. అయితే, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరమే ఈ లావాదేవీ పూర్తి కానుంది.మరో మూడు నెలలుఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్ బదాలే కన్సార్టియం నుంచి అదర్ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్ జట్టులో మిట్టల్ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు. దీంతో రాయల్స్ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్–భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బదాలే సభ్యులుగా ఉంటారు.ఇక రాజస్తాన్ సాదుల్పూర్లో జన్మించిన లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్‌కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్ రాయల్స్ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు.లీగల్ లెటర్ పంపించబోతున్నాముఈ నేపథ్యంలో కాల్ సోమాని సన్నిహిత వర్గాలు స్పందించాయి. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. సోమాని కన్సార్టియం ఈ అంశం మీద చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘‘అమెరికాలోని మా లీగల్, PR (పబ్లిక్ రిలేషన్స్) టీమ్స్ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నాయి.లీగల్ లెటర్ పంపించబోతున్నాము. సోమాని కన్సార్టియంలో వాల్టన్, హాంప్ వంటి ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు డబ్బు ఇక్కడ అసలు సమస్యే కాదు. ఏం జరిగిందో తెలియదు. చర్చలు సజావుగానే సాగినా ఇలాంటి పరిణామం ఎదురైంది.ఈ విషయంలో మాకెన్నో సందేహాలు ఉన్నాయి. బీసీసీఐకి చెల్లింపులు నిజంగానే బకాయి పడ్డాయా?.. చట్టపరంగా మాకున్న అవకాశాలు ఏమిటి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. మా మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కావాలనే చెల్లింపుల విషయంలో వాళ్లు (బోర్డు) ఆలస్యం చేశారనిపిస్తోంది. మేము సిద్ధంగా ఉన్న వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడేమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. మేము అంతర్గతంగా ఈ సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్ -
రూ. 15 వేల కోట్లు.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందే రెండు ఫ్రాంఛైజీల అమ్మకం జరిగిపోయింది. ఆరంభ సీజన్ 2008 విజేత రాజస్తాన్ రాయల్స్ అనూహ్య రీతిలో 1.63 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15, 341 కోట్లు)కు అమ్ముడుపోగా.. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ సుమారు రూ. 16,753 కోట్ల ధర పలికినట్లు సమాచారం.రాజస్తాన్ రాయల్స్ జట్టులలో వంద శాతం వాటాను అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం వాటాదారులు.షేన్ వార్న్ కుటుంబానికి భారీ లాభంఇక ఈ భారీ ఒప్పందం కారణంగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ కుటుంబం కూడా భారీగా లాభపడినట్లు సమాచారం. రాజస్తాన్ రాయల్స్ తొలి కెప్టెన్‌గా.. అరంగేట్ర సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన ఘనత వార్న్‌కు ఉంది. కేవలం బంతితో మాయాజాలం చేయడమే కాకుండా.. పెట్టుబడుల విషయంలోనూ షేన్ వార్న్ ముందు చూపు వల్లే ఇప్పుడు అతడి ఫ్యామిలీకి వందల కోట్ల ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆ ఒప్పందం ప్రకారంఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్తాన్ జట్టుతో చేరిన సమయంలోనే వార్న్ ఓ కండిషన్ పెట్టినట్లు గతంలో వెల్లడించాడు. ‘‘మా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. వాళ్లు నన్ను కెప్టెన్‌గా, కోచ్‌గా సేవలు అందించమన్నారు. నాకు నచ్చినట్లుగా జట్టును నడిపించమన్నారు. అంతా నన్నే చూసుకోమన్నారు’’ అని వార్న్ గతంలో ది హెరాల్డ్ సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక ఆ ఒప్పందం ప్రకారం జట్టుతో కొనసాగిన కాలంలో ఏడాదికి 0.75 శాతం వాటా వార్న్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వార్న్ రాజస్తాన్‌తో నాలుగేళ్లు కొనసాగినందున మొత్తంగా అతడి వాటా మూడు శాతానికి చేరినట్లు సమాచారం. రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటాఈ క్రమంలో తాజా ఒప్పందం ప్రకారం.. వార్న్ కుటుంబానికి రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటా లభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 తర్వాత వార్న్ కుటుంబం తమ వాటా అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.నాడు రూ. 320 కోట్లు మాత్రమేఅయితే, ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తప్పనిసరి. కాగా 2008లోఎమర్జింగ్ మీడియా యజమాని మనోజ్ బదాలే 65%, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% వాటాలతో రాజస్తాన్ రాయల్స్‌ను సొంతం చేసుకున్నారు. నాడు ఆ జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి రాయల్స్ హక్కులు లభిస్తాయి. కాగా 2022లో షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, పద్దెమినిదేళ్ల క్రితం ఈ స్పిన్ లెజెండ్ పెట్టిన పెట్టుబడి అతడి కుటుంబానికి ఈ మేర లాభం చేకూర్చడం విశేషం.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
రాయల్ ‘బిర్లా’ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. లీగ్ విలువను చూపిస్తూ రెండు ఐపీఎల్ జట్లు కలిపి ఏకంగా సుమారు రూ.32 వేల కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. క్రికెట్‌తో పరిచయం లేని అమెరికా వ్యాపార సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా లీగ్‌తో జత కట్టేందుకు భారీ మొత్తాలతో ముందుకు వచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభమైన 2008 నుంచి లీగ్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ జట్టును అమ్మకానికి ఉంచగా... అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమానితో పాటు రాబ్ వాల్టన్, హ్యాంప్ ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్నారు. టెక్నాలజీ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్, ఎడ్యుటెక్ సర్వీసెస్ రంగాల్లో ఇన్ట్రా ఎడ్జ్, ట్రూయో.ఏఐ, అకడమియన్ వంటి సంస్థలకు అధిపతిగా సోమాని ఉన్నారు. రాబ్ వాల్టన్ ప్రఖ్యాత వాల్‌మార్ట్ కంపెనీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, ఫోర్డ్ మోటార్ కంపెనీకి హ్యాంప్ ఫ్యామిలీ యజమానిగా ఉంది. సోమాని రాజస్తాన్ జట్టులో 2021 నుంచి చిన్న వాటాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిని సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్–2026 ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి జట్టుపై హక్కులు లభిస్తాయి. అసాధారణ పెరుగుదల... నిజానికి ఐపీఎల్లో ఆట, అభిమానులపరంగా చూస్తే రాజస్తాన్ రాయల్స్ జట్టుకే చివరి స్థానం దక్కుతుంది. 2008లో తొలిసారి టోర్నీ గెలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమ్ సాగుతూ వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్లలో టీమ్‌పై నిషేధం కూడా పడింది. 2008లో 67 మిలియన్ డాలర్లకు ఈ జట్టు అమ్ముడుపోయింది. నాటి రూపాయి విలువ ప్రకారం జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే! ఇతర ఏడు జట్లతో పోలిస్తే రాజస్తాన్ అన్నింటికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయింది. రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు (ఇప్పటి వరకు) మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) 65%, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% ఎవరు కొన్నారు? కాల్ సోమాని: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్ట్రా ఎడ్జ్ కంపెనీ సీఈఓ రాబ్ వాల్టన్: వాల్‌మార్ట్ కుటుంబ వారసుడు, అమెరికాలోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో డెన్వర్ బ్రోంకోస్ జట్టు యజమాని. హ్యాంప్ ఫ్యామిలీ: ఫోర్డ్ కంపెనీ మరియు ఫైర్‌స్టోన్ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్... హ్యాంప్ ఫ్యామిలీ కోడలిగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎన్ఎఫ్ఎల్లో డెట్రాయిట్ లయన్స్ జట్టుకు యజమాని. ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకం కూడా పూర్తయినట్లు సమాచారం. 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,753 కోట్లు) ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును సొంతం చేసుకుంది. ఐపీఎల్ టీమ్‌తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోని ఆర్సీబీ జట్టు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆర్సీబీని కొన్న కన్సార్టియంలో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్స్ (బీఎక్స్‌పీఈ) కలిసి భారీ మొత్తానికి బెంగళూరు జట్టును తమదిగా మార్చుకున్నాయి. 2008 తొలి ఐపీఎల్ సమయంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ గ్రూప్ 111.6 మిలియన్ డాలర్లకు (నాటి విలువ ప్రకారం సుమారు రూ.485 కోట్లు) సొంతం చేసుకుంది. బోల్ట్ వెంచర్స్ తరఫున ప్రముఖ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్స్, బీఎక్స్‌పీఈ తరఫున విరాల్ పటేల్ టీమ్ యాజమాన్యంలో భాగస్వాములు కానుండగా... ఆర్యమాన్ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్ గ్రూప్ నుంచి సత్యన్ గాజ్వాని వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. -
RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్-2008 విజేత రాజస్తాన్ రాయల్స్ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రూ. 15 వేల కోట్లకు సొంతం!జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ రాజస్తాన్ రాయల్స్‌కు యజమానిగా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్, లాచ్లాన్ ముర్దోచ్ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బిల్ట్జర్ రాయల్స్‌ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.ఎవరీ కల్ సోమానీ?ఎడ్ టెక్, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్ సంస్థలు ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం


