నగరంలో కాఫీ పెట్టిన కార్తీ
సోమాజిగూడ: ప్రముఖ నటుడు కార్తీ బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ ‘బ్రూ రోస్ట్ అండ్ గ్రౌండ్’ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించారు. తనకు అత్యంత ప్రియమైన బ్రూ కాఫీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నటుడు నాగార్జున సోదరుడిలాంటి వాడన్నారు. తనూ తమన్నా, కాజల్ మంచి ఫ్రెండ్స్, అందరం దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.