-
సౌత్‌జోన్ కబడ్డీ: రన్నరప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 40-30తో ఆంధ్రను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలోనూ కర్ణాటకకే టైటిల్ లభించింది. ఫైనల్లో కర్ణాటక 12-11తో సర్వీసెస్‌ను ఓడించింది. ఆంధ్ర జట్టుకు చెందిన శివ జ్యోతి ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారం గెలుచుకుంది. మహిళల సెమీఫైనల్స్‌లో కర్ణాటక 49-23తో పాండిచ్చేరిపై, ఆంధ్ర 50-39తో తమిళనాడుపై నెగ్గాయి. పురుషుల సెమీఫైనల్స్‌లో సర్వీసెస్ 39-28తో తమిళనాడుపై, కర్ణాటక 30-10తో హైదరాబాద్‌పై నెగ్గాయి. -
సెమీస్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్ జోన్)లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక్కడి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో హైదరాబాద్, మహిళల విభాగంలో ఆంధ్ర జట్టు సెమీస్ చేరుకున్నాయి. ఈ పోటీల్లో రెండో రోజు శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 33-25 స్కోరుతో కేరళ జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. హైదరాబాద్ జట్టులో మహేందర్‌రెడ్డి, మల్లేష్ రాణించారు. మహిళల విభాగంలో ఆంధ్ర 39-36తో కేరళను చిత్తు చేసింది. ఫలితంగా లీగ్‌లో వరుసగా రెండో విజయంతో సెమీస్ స్థానం దక్కించుకుంది. పురుషుల విభాగంలో హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, సర్వీసెస్...మహిళల విభాగంలో ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి జట్లు సెమీస్‌కి చేరాయి. -
రేపటినుంచి సౌత్‌జోన్ కబడ్డీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)కు నగరం మరో సారి వేదికైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరగనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో భారత కబడ్డీ సమాఖ్య ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. సూపర్ నేషనల్స్ కోసం... దేశవ్యాప్తంగా 33 జట్లను నాలుగు పూల్‌లుగా విభజించారు. ఒక్కో పూల్నుంచి నాలుగు జట్లను ఎంపిక చేసి జనవరి 21నుంచి పాట్నాలో సూపర్ నేషనల్స్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సౌత్ పూల్ విభాగం మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. హైదరాబాద్, ఆంధ్ర, అండమాన్ నికోబార్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వచ్చే ఆసియా క్రీడల కోసం గాంధీనగర్‌లో జరుగుతున్న భారత జట్టు క్యాంప్‌లో ఉన్న అనేక మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగం కానున్నారు. ‘భారత కబడ్డీ భవిష్యత్తు, ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ టోర్నీని అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ మ్యాట్‌పై నిర్వహిస్తున్నాం’ అని జగదీశ్వర్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు రంగారావు, సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. మరో వైపు వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఆసియా క్రీడల్లో కబడ్డీలో రాణించాలనే సంకల్పంతో ఉన్న కొరియా జట్టు శిక్షణ, ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ రావడం విశేషం.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement