సౌత్‌జోన్ కబడ్డీ: రన్నరప్ ఆంధ్ర


సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 40-30తో ఆంధ్రను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలోనూ కర్ణాటకకే టైటిల్ లభించింది. ఫైనల్లో కర్ణాటక 12-11తో సర్వీసెస్‌ను ఓడించింది.

 

 ఆంధ్ర జట్టుకు చెందిన శివ జ్యోతి ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారం గెలుచుకుంది. మహిళల సెమీఫైనల్స్‌లో కర్ణాటక 49-23తో పాండిచ్చేరిపై, ఆంధ్ర 50-39తో తమిళనాడుపై నెగ్గాయి. పురుషుల సెమీఫైనల్స్‌లో సర్వీసెస్ 39-28తో తమిళనాడుపై, కర్ణాటక 30-10తో హైదరాబాద్‌పై నెగ్గాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top