-
ప్రాంతీయ భాషల్లో ‘నీట్’ను పరిశీలిస్తాం: సుప్రీం
తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు అనుమతి కోరిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘నీట్’ రాయటం తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది ఈ పరీక్షను తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. సుప్రీం బెంచ్ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించే అంశం ప్రస్తావన లేదని.. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ మంగళవారం జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. నీట్‌ను ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించడం వల్ల ప్రాంతీయ భాష విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు నష్టపోతారని, ఈ విద్యా సంవత్సరానికి తెలుగు, తమిళం, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీల్లో నిర్వహించేలా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఎస్ఈ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఈ ఏడాది నీట్ నిర్వహణ నుంచి రాష్ట్రాలను మినహాయించాలని గుజరాత్ న్యాయవాది తుషార్ మెహతా మరోసారి బెంచ్కునివేదించారు. ఈ అంశాలపై మరో బెంచ్ ఏర్పాటు చేసే విషయమై ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని బెంచ్ పేర్కొంది. మెడికల్ సీట్ల భర్తీకి ‘గుజ్‌సెట్’ నిర్వహణ అహ్మదాబాద్: వైద్య విద్య ప్రవేశాలను ‘నీట్’ ద్వారా మాత్రమే కల్పించాలన్న సుప్రీం ఆదేశాలను గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వైద్య సీట్ల భర్తీకి ‘గుజరాత్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’(గుజ్‌సెట్)ను మంగళవారం నిర్వహించింది. 68 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ‘మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ ఇతర వైద్య సంబంధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించింది గుజ్‌సెట్. ఈ క్రమంలో నీట్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై మరోమారు సుప్రీంలో పిటిషన్ వేశాం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. -
చిన్నారుల అక్రమ రవాణాపై కేంద్రం నిర్లక్ష్యం: సుప్రీం
న్యూఢిల్లీ: చిన్నారుల అక్రమ రవాణా, వ్యభిచారాలను నిరోధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు గురువారం ఆక్షేపించింది. ఆ దారుణాలను అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు చేపట్టిన చర్యల వివరాలు తెలుసుకోవాలంటూ తామిచ్చిన ఆదేశాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసేందుకే కేంద్రానికి నెల రోజులకు పైగా సమయం పట్టిందని విమర్శించింది. గత సంవత్సరం అక్టోబర్ 30న తాము ఆదేశాలిస్తే డిసెంబర్ 12న.. నెల రోజుల తరువాత రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని పంపించారని జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన సమాచారం ఇవ్వని రాష్ట్రాలపై తీసుకున్న చర్యలనూ కేంద్రం కోర్టుకు తెలియపర్చలేదని పేర్కొంది. వ్యభిచారం పేరుతో లైంగిక దోపిడికి గురైన బాధితుల కోసం ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రొటోకాల్’ను ఏర్పాటు చేయాలన్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ చేసిన సూచనలపై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement