breaking news
Jurassic
-
జురాసిక్ వరల్డ్.. పునర్జన్మలోనూ అదరగొట్టేసింది!
గతంలో సినీ ప్రియులను మెప్పించిన జురాసిక్ వరల్డ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జురాసిక్ వరల్డ్: రీ బర్త్ పేరిట సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 2న రిలీజైన ఈ చిత్రం ఇండియాలోనే అరుదైన రికార్డ్ సాధించింది. దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో ఈ ఏడాది జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 49.3 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు.జురాసిక్ ప్రాంఛైజీలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన రీతిలో ఆడియన్స్‌ను మెప్పించాయి. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు మొదటి రెండు భాగాలకు జురాసిక్ మూవీస్‌కు కథ అందించిన డేవిడ్ కోప్ స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఇక మార్వెల్ బ్యూటి బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్‌లో మెయిన్ లీడ్ రోల్లో కనిపించారు. -
'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'
లాంస్ ఎంజిల్స్: వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే.. అది కూడా దాని శ్వాస నిట్టూర్పులు తగిలేంత దగ్గరిగా.. రెండు చేతులు పట్టినా సరిపోనంత పెద్ద కోరలతో ఆ జంతువుంటే.. అమ్మో ఒళ్లు జలదరించి పోతుందికదా.. ఇదే కాదు ఇలాంటి ఎన్నో అనుభవాలు అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. మీకే కాదు ఆ సమయంలో మీతో పాటు కూర్చున్న అందరికీ కూడా. ఇంతకీ ఏంటనీ అనుకుంటున్నారా.. జురాసిక్ చిత్రాలు మీరు చూసే ఉంటారుగా.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ చిత్రాలకు సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత గొప్పగా తీర్చి దిద్ది 'జురాసిక్ వరల్డ్' అనే పేరుతో దర్శకుడు కోలిన్ ట్రెవర్రో గాడ్జిల్లాలతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనున్న ఈ చిత్రానికి చెందిన కొన్ని పోస్టర్లు ఆయన ఆన్లైన్లో విడుదల చేశారు. ఆ పోస్టర్లలో ఈ చిత్రంలోని హీరోయిన్ బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓ అద్దాల భవంతిలో నిల్చుని ఉండగా.. అద్దం వెలుపల సరిగ్గా ముఖానికి దగ్గర ఓ పెద్ద గాడ్జిల్లా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కనిపిస్తుంది. ఇలాంటి పోస్టర్లు ఇంకెన్నో ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి.