'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!' | New 'Jurassic World' poster unveiled | Sakshi
Sakshi News home page

'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'

Apr 19 2015 8:50 AM | Updated on Sep 3 2017 12:32 AM

'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'

'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'

వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే..

లాంస్ ఎంజిల్స్: వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే.. అది కూడా  దాని శ్వాస నిట్టూర్పులు తగిలేంత దగ్గరిగా.. రెండు చేతులు పట్టినా సరిపోనంత పెద్ద కోరలతో ఆ జంతువుంటే.. అమ్మో ఒళ్లు జలదరించి పోతుందికదా.. ఇదే కాదు ఇలాంటి ఎన్నో అనుభవాలు అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి.

మీకే కాదు ఆ సమయంలో మీతో పాటు కూర్చున్న అందరికీ కూడా. ఇంతకీ ఏంటనీ అనుకుంటున్నారా.. జురాసిక్ చిత్రాలు మీరు చూసే ఉంటారుగా.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ చిత్రాలకు సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత గొప్పగా తీర్చి దిద్ది 'జురాసిక్ వరల్డ్' అనే పేరుతో దర్శకుడు కోలిన్ ట్రెవర్రో గాడ్జిల్లాలతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనున్న ఈ చిత్రానికి చెందిన కొన్ని పోస్టర్లు ఆయన ఆన్లైన్లో విడుదల చేశారు. ఆ పోస్టర్లలో ఈ చిత్రంలోని హీరోయిన్ బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓ అద్దాల భవంతిలో నిల్చుని ఉండగా.. అద్దం వెలుపల సరిగ్గా ముఖానికి దగ్గర ఓ పెద్ద గాడ్జిల్లా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కనిపిస్తుంది. ఇలాంటి పోస్టర్లు ఇంకెన్నో ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement