breaking news
Judges Allocation list
-
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
ప్రాంతీయత ఆధారంగానే కేటాయించాలి
* తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం డిమాండ్ * న్యాయాధికారుల కేటాయింపు జాబితాను ఉపసంహరించుకోవాలి * కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన తర్వాతే హైకోర్టు జడ్జిల భర్తీ * త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి న్యాయాధికారులను కేటాయిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు తేల్చి చెప్పా రు. తెలంగాణ న్యాయాధికారులకు అన్యా యం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల సర్వీసు రికార్డులో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా కేటాయింపులు చేయాలని కోరారు. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక జాబితా రూపొందిందని, అది తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేసే విధంగా ఉందని తెలంగాణ న్యాయవాదులు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు అధ్యక్షతన హైకోర్టులో జరిగిన ఈ సమావేశంలో పెద్దసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు న్యాయవాదులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఇక న్యాయవాదుల జేఏసీ, రాష్ట్రంలోని ఇతర న్యాయవాదుల సంఘాలతో చర్చించి తమ ఆందోళనకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సంఘం అధ్యక్షుడు గండ్రమోహన్‌రావు తెలిపారు. సమావేశం అనంతరం కేటాయింపుల ప్రాథమిక జాబితా ప్రతులను న్యాయవాదులు హైకోర్టు బయట తగులబెట్టారు. మరోవైపు ప్రాథమిక జాబితాపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య పాల్గొన్న సమావేశాన్ని అక్కడి న్యాయవాదులు బహిష్కరించారు. న్యాయవాదుల సంఘం చేసిన తీర్మానాలు * తక్షణమే హైకోర్టు విభజన చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి * న్యాయాధికారుల కేటాయింపు ప్రాథమిక జాబితాను వెంటనే ఉపసంహరించుకోవాలి * సర్వీసు రికార్డుల్లోని ప్రాంతం ఆధారంగా న్యాయాధికారుల కేటాయింపు జరగాలి * సెక్షన్-77 ప్రకారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆమోదం తీసుకోవాలి * కిందిస్థాయి న్యాయవ్యవస్థను విభజించాకే జడ్జిల నియామకాన్ని ప్రారంభించాలి * ఈ డిమాండ్ల సాధనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ, హోం, ఇతర శాఖల మంత్రులను కలసి వినతిపత్రాలు ఇవ్వాలి.