joint assets
-
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆర్థిక ప్రయాణం కూడా. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి ఆస్తులు కొంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బంధం విడాకుల వరకు వెళ్తే.. మరి వారు ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఎవరిది? అనే ప్రశ్న వివాదంగా మారుతోంది.ఇటీవల ‘1 ఫైనాన్స్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విడాకులు తీసుకున్న వారిలో 67 శాతం మంది తాము విడిపోకముందే తీవ్రమైన ఆర్థిక విభేదాలు ఎదుర్కొన్నట్లు తేలింది. అంతేకాకుండా, 43 శాతం కేసుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైవాహిక ఆస్తుల యాజమాన్యంపై చట్టం ఏం చెబుతోంది? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను చూద్దాం.టైటిల్ డీడ్ వర్సెస్ కంట్రిబ్యూషన్: చట్టం ఏం చెబుతోంది?1955 హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారే యజమాని అనేది ప్రాథమిక సూత్రం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త ఆస్తిలో భార్యకు లేదా భార్య ఆస్తిలో భర్తకు సగం వాటా దానంతట అదే రాదు. ఇటీవల అమిష్ అగర్వాలా కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. భర్త పేరు మీద ఉన్న నివాస ఆస్తిలో తనకూ వాటా కావాలని భార్య కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘వివాహం జరిగినంత మాత్రాన స్థిరాస్తిపై ఉమ్మడి యాజమాన్యం ఏర్పడదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలులో తమ ఆర్థిక భాగస్వామ్యం ఉందనడానికి బ్యాంకు స్టేట్మెంట్లు వంటి పక్కా ఆధారాలు చూపాలని న్యాయస్థానం పేర్కొంది.వినీతా సక్సేనా కేసు మినహాయింపుసుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిపై విభిన్నంగా స్పందించింది. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (2006) కేసులో ఆస్తి భర్త పేరు మీద ఉన్నప్పటికీ భార్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గృహిణిగా ఆమె అందించిన సేవలు, ఇంటి నిర్వహణలో ఆమె పడిన శ్రమను ‘పరోక్ష సహకారం’గా గుర్తించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమెకు హక్కు కల్పించింది.నేటికీ చాలామందిలో ఆస్తి విషయంలో కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి. 1 ఫైనాన్స్‌లో విల్, ఎస్టేట్ ప్లానింగ్ హెడ్ శ్రద్ధా నీలేశ్వర్ కొన్ని కీలక విషయాలను వివరించారు. తాను తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.పెళ్లయ్యాక కొన్న ఆస్తిలో భాగస్వామికి ఆటోమేటిక్‌గా 50% వాటా రాదు.‘షమీమా ఫరూకీ వర్సెస్ షాహిద్ ఖాన్ (2015)’ కేసు ప్రకారం, ఆస్తిలో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, పూర్తి యాజమాన్య హక్కులు ఉండవు.చాలామంది పన్ను ఆదా కోసం ఒకరి పేరు మీదనే ఆస్తులు కొంటారు, కానీ విడాకుల సమయంలో ఇది రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది.ప్రస్తుతం 42 శాతం మంది పురుషులు తమ సంపాదనలో సగటున 38 శాతాన్ని భరణం లేదా వివాహ సంబంధిత రుణాలకే వెచ్చిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రణాళికలో రికార్డుల ప్రాధాన్యతను చెబుతోంది.నిపుణుల సూచనలుభవిష్యత్తులో ఆస్తి తగాదాలు తప్పించుకోవడానికి కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల సెక్షన్ 80సీ, సెక్షన్ 24(b) కింద ఇద్దరూ పన్ను మినహాయింపు పొందవచ్చు.డౌన్ పేమెంట్స్ లేదా ఈఎంఐలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్మెంట్లను భద్రపరుచుకోవాలి.ఆస్తిలో ఎవరి వాటా ఎంతో దస్తావేజుల్లోనే పేర్కొనడం ఉత్తమం.వివాహం అనేది నమ్మకంతో కూడిన బంధం అయినప్పటికీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం నేటి కాలంలో అత్యవసరం. చట్టపరమైన చిక్కులు రాకముందే మేల్కొని ఆస్తులకు సంబంధించిన సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
‘ఉమ్మడి ఆస్తుల’పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పలు అంశాల నేపథ్యంలో పిటిషన్‌ను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
నక్సల్స్ నిధులకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నక్సలైట్ల ఆదాయ మార్గాలను మూసివేయడంతోపాటు నక్సల్ నేతల ఆస్తులను జప్తు చేయడం కోసం వివిధ దర్యాప్తు సంస్థల అధికారులతో ఓ ప్రత్యేక బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ కేంద్ర సంస్థలతోపాటు రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాల వారు కూడా ఉంటారని హోం శాఖకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పారు. ఈ బృందానికి అదనపు కార్యదర్శి స్థాయి వ్యక్తి నేతృత్వం వహిస్తారనీ, ఐబీ, ఈడీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, సీబీఐ, సీబీడీటీలతోపాటు రాష్ట్రాల నిఘా, నేర దర్యాప్తు విభాగాల అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని అధికారి వివరించారు. నక్సల్ నేతలు బలవంతంగా వసూళ్లకు పాల్పడి, అనంతరం ఆ డబ్బును తమ వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, కుటుంబ సభ్యుల చదువు, విలాసాల కోసం వినియోగిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో హోం శాఖ తాజా చర్య తీసుకుంది. బిహార్–జార్ఖండ్ కమిటీకి చెందిన సీపీఐ (మావోయిస్టు) నేత ప్రద్యుమ్న శర్మ గతేడాది రూ. 22 లక్షలు కట్టి తన సోదరి కూతురిని ఓ ప్రైవేట్ వైద్యకళాశాలలో చేర్పించారు. అదే పార్టీకే చెందిన సందీప్ యాదవ్ అనే మరో నేత నోట్ల రద్దు సమయంలో రూ. 15 లక్షల విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. ఆయన కూతురు ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలో, కొడుకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు అధికారి తెలిపారు. మరో సీనియర్ నాయకుడు అరవింద్ యాదవ్ కూడా తన సోదరుడి చదువు కోసం రూ. 12 లక్షలు చెల్లించారన్నారు. -
ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే!
‘పవర్’ పంపకాలకు రంగం సిద్ధంఆస్తుల విభజన ముసాయిదాకు ఏపీ జెన్కో బోర్డు ఆమోదం హైదరాబాద్: విద్యుత్ సంస్థల ఉమ్మడి ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంచేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఏపీ ఉత్పాదక సంస్థ పాలక మండలి(అవిభక్త రాష్ట్రంలోని ఏపీ జెన్కో బోర్డు) ఆమోదించింది. దీన్ని కేంద్రం నియమించిన షీలాబిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీకి సమర్పించింది. ఈ వివరాలను బుధవారం అధికారవర్గాలు విడుదల చేశాయి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం 2014 మే 31న విడుదల చేయడం, దీనిప్రకారం బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించే బాధ్యతలను కేపీఎంజీ సంస్థకు అప్పగించడం తెలిసిందే. కేంద్రచట్టానికి అనుగుణంగా కేపీఎంజీ రూపొందించిన ముసాయిదాను ఏపీజెన్కో ఆమోదించడంతో ఓ అంకం ముగిసింది. అయితే ముసాయిదాపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు తమ అభ్యంతరాల్ని నిపుణుల కమిటీకి తెలపాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించాక కమిటీ తుదినిర్ణయం తీసుకుంటుంది. అయితే కమిటీ కాలపరిమితి ఈ నెల 31వరకే ఉంది. దీన్ని కేంద్రం పొడిగించే అవకాశముంది. మొత్తంమీద మరో ఆరు నెలల్లో ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. తెలంగాణకే అప్పులు, ఆస్తులు.. ఉమ్మడి ఆస్తులు, అప్పుల్లో సింహభాగం తెలంగాణకే వెళ్తున్నాయి. అవిభక్త రాష్ట్రంలో ప్రతిపాదిత విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టుల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయి. కేటీపీపీ-2, లోయర్ జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, ఎగువ జూరాల.. ఇలా మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నాయి. స్థానికతనుబట్టి ఇవన్నీ తెలంగాణకే చెందుతాయి. కాబట్టి వీటి నిర్మాణానికి తీసుకున్న అప్పులన్నీ ఆ రాష్ట్రమే భరించాలని ముసాయిదా పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టుల స్థిరాస్తులన్నీ తెలంగాణకే సొంతం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీపీపీ-4 మాత్రమే నిర్మాణ దశలో ఉంది. దీని వ్యయం, స్థిరాస్తిని ఆ రాష్ట్రఖాతాలో చేర్చారు. ఫలితంగా రూ.7,168 కోట్లున్న నిర్మాణ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,201 కోట్లు, తెలంగాణకు రూ.4,967 కోట్లుగా విభజించారు. జెన్కో ప్రాజెక్టుల ప్రధాన కార్యాలయాలు, యంత్రసామాగ్రీ తెలంగాణలోనే ఉన్నందున స్థిరాస్తులు(ఇప్పుడున్నవి, కొత్త ప్రాజెక్టులు) రూ.12,748 కోట్లు ఉంటే.. ఇందులో ఏపీకి రూ.4,947 కోట్లు, తెలంగాణకు రూ.7,801 కోట్లు చొప్పున వాటా దక్కుతుంది. ఈ ప్రకారం మూలధనం, ఆదాయం, దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు, ఇతర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ఎక్కువగా ఉంటాయి.


