breaking news
Joining Dates
-
విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా కొత్త ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్‌బోర్డింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియ కింద ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థులకు జులై 2025లో ఆఫర్ లెటర్లు, ఆగస్టు 2025లో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందాయి. మార్చి 2026లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేటికీ అధికారికంగా విధుల్లో చేరే తేదీ కేటాయించలేదు. కంపెనీ హెచ్ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక, ఆర్థిక ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఆవేదన వ్యక్తం చేశారు.నైట్స్ ప్రధాన డిమాండ్లుబాధిత అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌కు సంబంధించి సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విప్రో ప్రకటించాలి. ఆఫర్ లెటర్లు, ఎల్‌ఓఐల చెల్లుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఒకవేళ ఎంపికను రద్దు చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అభ్యర్థులకు రాతపూర్వకంగా స్పష్టం చేయాలి.క్యాంపస్ ఎంపికల్లో విప్రో ఉద్యోగం వచ్చిందనే ధీమాతో చాలామంది ఇతర కంపెనీల అవకాశాలను వదులుకున్నారని, ప్రస్తుత జాప్యం వారి కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని వేధిస్తున్న అనిశ్చితి, క్లయింట్ ప్రాజెక్టుల మందగమనమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై విప్రో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే! -
ఫ్లిప్ కార్ట్ పై దుమారం
అహ్మదాబాద్: ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై ఇండియన్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకుని నియామక తేదీని వాయిదా వేస్తూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌పై గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిసెంబరులో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ బిన్నీ బన్సల్‌కు మెయిల్ప్ పంపించారు. వెంటనే తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ తదితరులకు కూడా ఐఐఎం ఈమెయిల్ పంపించారు. దీంతోపాటుగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన రూ.1.5లక్షల నష్టపరిహారం కూడా ఆమోదయోగ్యంకాదని తెలిపారు. జూన్ నెల నుంచి మొదలు, ఒకేసారి కాకపోయినా, జోయినింగ్ బోనస్ గా కానీ, బకాయిల రూపంలోగానీ నెలవారీ పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర కంపెనీల మంచి ఉద్యోగ అవకాశాలను చాలా వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఐఐఎం అహ్మదాబాద్ ప్లేస్మెంట్ కమిటీ చైర్పర్సన్ ఆశా కౌల్ మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరిలో 18 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని జూన్ లో ఉద్యోగాలిస్తామన్నారని తెలిపారు. ఉద్యోగ నియామక తేదీ మార్పు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొందరికి లోన్లు చెల్లించాల్సిన అవసరాలు ఉన్నాయంన్నారు. సంస్థ కార్పొరేట్ విస్తరణలో భాగంగా నియామకాలు ఆలస్యమవుతాయని చెప్పందన్నారు. ఇదే సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సి ఉందని తెలిపారు. మరోవైపు తమ వ్యాపారాలు పునర్నిర్మాణం చేసుకునే పని లోఉన్నాం కాబట్టి కానీ సమయం పడుతుంది దని సంస్థ తెలిపినట్టు సమాచారం.


