breaking news
JDS rebel MLAs
-
‘యడ్యూరప్ప పీఏ నన్ను హైజాక్ చేశాడు’
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో జనతా దళ్ (సెక్యులర్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 14 మంది శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజీనామ చేసిన రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్‌ను యడ్యూరప్ప హైజాక్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందే నగేష్ నాకు కాల్ చేశారు. యడ్యూరప్ప పీఏ తనను హైజాక్ చేశాడని చెప్పారు. వెంటనే నేను విమానాశ్రయానికి వెళ్లాను. ఆ లోపే విమానం వెళ్లి పోయింది’ అన్నారు. ఇదంతా యడ్యూరప్ప దర్శకత్వంలోనే జరుగుతుందని శివకుమార్ ఆరోపించారు. ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి అయిన నగేష్ గత నెలలోనే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా సంక్షోభ పరిస్థితుల్లో నగేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. విమానాశ్రయంలో నగేష్ విమానం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
సంకీర్ణ సర్కార్‌కు ఢోకా లేదు : కుమారస్వామి
బెంగళూర్ : కర్ణాటకలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. సంకీర్ణ సర్కార్ ముందున్న సమస్యలు త్వరలో సమసిపోతాయని చెప్పారు. త్వరలోనే కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపడతామని తెలిపారు. కాగా కర్ణాటకలో సంక్షోభం ఎదుర్కొంటున్న జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సమస్యలను అధిగమించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలకు పదునుపెట్టింది. కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా, జేడీఎస్ మంత్రులు సైతం రాజీనామా చేసి ఇరు పార్టీలకు రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆఫర్ చేస్తామనే సంకేతాలు పంపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం కుమారస్వామి ప్రకటించి రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేరువయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేయడం ద్వారా వారు బీజేపీకి దగ్గరకాకుండా నిలువరించాలని సంకీర్ణ సర్కార్ యోచిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ 35 మంది పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది. -
మేము నోరు విప్పితే... దళపతి తట్టుకోలేరు..
బెంగళూరు : జేడీఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. తమపై ఆరోపణలు మానకపోతే దేవెగౌడ గురించిన నిజాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసినందుకు శాసనసభ్యులు జమీర్ అహ్మద్‌ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, గోపాలయ్య, ఇక్బాల్ అన్సారి, రమేష్ బండి సిద్దేగౌడ, భీమానాయక్, అఖండశ్రీనివాస మూర్తిలను జేడీఎస్ పార్టీ సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చలువరాయస్వామి నేతృత్వంలో వీరంతా నగరంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశమమై తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం చలువరాయస్వామి తన సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడానికి, తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యడానికి జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఏక పక్ష నిర్ణయాలే కారణమన్నారు. ఇప్పటి వకూ తమకు సస్పెన్షన్ నోటీసు అందలేదని అందువల్ల తాము ఈ క్షణం వరకూ జేడీఎస్ ఎమ్మెల్యేలమేనన్నారు. ‘మేము విప్ ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసినట్లు దేవెగౌడ చెబుతున్నారు. అయితే 2006లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించారు. ఆయనకు మేము సహకారం కూడా అందించాం. అప్పుడు ఎందుకు ఆయన్ను, మమ్ములను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కుమారస్వామికి ఒక న్యాయం మాకో న్యాయమా ?’ అని ప్రశ్నించారు. తమపై ఫేస్బుక్, వాట్సాప్‌లలో అనవసర ఆరోపణలు చేయడం తగదన్నారు. తాము చనిపోయినట్లు పేర్కొని పెద్దకర్మ చేస్తున్నట్లు పోస్టర్లు వేయడం, కరపత్రాలు పంచడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వీటినన్నింటిని చూస్తూ ఊరుకున్నామంటే దేవెగౌడపై ఉన్న గౌరవమే కారణమన్నారు. ఆయన వల్లే తాము రాజకీయంగా ఎదిగామని, వారి ఇంట్లో భోజనం చేశామన్న విశ్వాసం తమకు ఇప్పటికీ ఉందన్నారు. అందువల్లే తాము దేవెగౌడ గురించి కాని, ఆ కుంటుంబ సభ్యుల గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. అలాకాక తాము నోరు విప్పితే నిజాలు బయటికి వస్తాయని వాటిని ఆ కుటుంబం తట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి జేడీఎస్ అధినాయకత్వం ప్రతి విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. జేడీఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఫరూక్‌ను ఎంపిక చేసే సమయంలో తమతో కాని మరి ఏ ఇతర ఎమ్మెల్యేలతో కాని అధినాయకత్వం మాట మాత్రమైనా చర్చించలేదన్నారు. అందువల్లే తాము కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి వచ్చిందని రెబెల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ‘ఇప్పటి వరకూ పార్టీ నుంచి రాజ్యసభకు పంపించిన రామస్వామి, రాజీవ్ చంద్రశేఖర్, కుపేంద్రరెడ్డి జేడీఎస్ పార్టీ కార్యకర్తలా? ఎమ్మెల్సీలైన శరవణ, కే.వి నారాయనస్వామి పార్టీ కోసం కష్టపడిన వారా? వారికి ఎందుకు టికెట్లు ఇచ్చి గెలిపించినట్లు?’ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.