breaking news
Jayalalithaas death case
-
జయలలిత మృతిపై అపోలో ఆస్పత్రి వివరణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చికిత్సకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక సీల్డ్ కవర్ లో అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని మద్రాస్ హైకోర్టుకు అపోలో తరపు న్యాయవాది పీఎస్ రామస్వామి తెలిపారు. జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నాయని దాఖలైన పిల్ పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. జయలలిత క్త సంబంధీకులు తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్‌కు ఉందా మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. ‘అమ్మ’ మృతి అనుమానాస్పదమని పేర్కొంటూ చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతకుముందు డిసెంబర్ 29న పిల్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసింది. జయలలిత మృతిపై పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. -
జయ చికిత్స వివరాలను వెల్లడిస్తాం
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో దాచి పెట్టాల్సిన విషయం ఏమీలేదని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు. జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు గురువారం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన విషయాలను కోర్టుకు తెలియజేస్తామని సరస్వతి చెప్పారు. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు చేసిన చికిత్స, డిశ్చార్జి అవుతారని భావిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించేవరకు.. అన్ని విషయాలను తెలియజేస్తామని తెలిపారు. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటామని సరస్వతి చెప్పారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన విషయం విదితమే. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలను వెల్లడించాలని కోరుతూ అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
జయ మృతిపై హైకోర్టుకు అనుమానాలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడికావాలన్నారు. కేసును రెగ్యులర్ బెంచ్ కు న్యాయమూర్తి బదిలీ చేశారు. అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ ఈ పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలు వెల్లడించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలిత మృతికి కారణాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందని జోసెఫ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.


