breaking news
Jayalalithaa portraits
-
జయలలిత ఫొటోలను తొలగించండి
-
జయలలిత ఫొటోలను తొలగించండి
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలినందున తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటోలను తొలగించాలని ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. అంతేగాక ఆమె పేరు మీద ప్రభుత్వ పథకాలను అమలు చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ మేరకు డిమాండ్ చేశారు. 'ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు జయలలితను దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె పేరుతో కొన్ని ప్రభుత్వ పథకాలున్నాయి. వీటి పేర్లను మార్చాలి. ప్రభుత్వం ఇకమీదట జయలలిత పేరుతో కొత్త పథకాలను ప్రకటించరాదు. సెక్రటేరియట్, మంత్రుల కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలలో ఉన్న ఆమె ఫొటోలను తొలగించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాధన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం కోర్టును ఆశ్రయిస్తాం' అని స్టాలిన్ చెప్పారు. జయలలిత 69వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లు, టీవీలలో ప్రకటనలు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.