breaking news
Jayabharat Reddy (24)
-
కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం
సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో భరత్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివాసముంటున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతులకు జయభారత్‌రెడ్డి మూడో కుమారుడు. తమ కుమారుడి కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని భరత్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ను కోరారు. కాగా, కోమాలోకి వెళ్లిన భరత్ చికిత్స కోసం స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు. -
టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం
సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివశిస్తున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతుల మూడో కుమారుడు జయభారత్‌రెడ్డి టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. జయభారత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో గదికి వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. శస్త్రచికిత్స చేసిన తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. అమెరికా వెళ్లేందుకు తమకు సహాయం చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావును, కలెక్టర్‌ను కోరనున్నట్లు చెప్పారు.