breaking news
Jaya Shankar Agricultural University
-
ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మంత్రి కేటీఆర్ ఇన్నోవేటివ్ హబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్ ఎవరి సోత్తూ కాదని, ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ విషయంలో తెలంగాణ రాష్ట్రం.. దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. టీ-ఫైబర్‌ను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా సంభాషించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: Schools Reopen In Telangana: సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా? -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి శంకుస్థాపన
సంగారెడ్డి: మన ప్రభుత్వం, మన పాలనలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 20 కోట్లతో విశ్వవిద్యాలయ భవనంతోపాటు బాలుర, బాలికల హాస్టళ్ల భవనాలు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యూనివర్సిటీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ విద్యార్థులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బాపట్ల, పులివెందులలో వ్యవసాయ కళాశాలలు స్థాపించిన ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి మాత్రం తీరని అన్యాయం చేశారన్నారు. అందువల్లే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అధిక నిధులను కేటాయిస్తున్నారని చెప్పారు. త్వరలోనే నిజామాబాద్, సిద్దిపేట తోర్నాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.