breaking news
Japan investments
-
ఏపీలో పెట్టుబడులు లాభదాయకం:చంద్రబాబు
జపాన్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ(జైకా) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని మౌలిక వసతులు, వనరులకు సంబంధించి చంద్రబాబు వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో పరిశ్రమలకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నట్లు బాబు పేర్కొన్నారు. జపాన్ కంపెనీల ఇండస్ట్రియల్ పార్క్ స్పెషల్ అధారిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఆయన జైకా ప్రతినిధులకు తెలిపారు. అంతకుముందు ఇసుజ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీ శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉందని ఇసుజ ప్రతినిధులు బాబుకు తెలిపారు. ఇండియాలో ఇసుజ మార్కెట్ విస్తరించాలని ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు కోరారు. ఇసుజతో పాటు మరిన్ని కంపెనీలను తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీ కృష్ణపట్నంలను లాజిస్టిక్ హబ్ లుగా మార్చాలనుకుంటున్నట్లు బాబు వారికి తెలిపారు. ఏపీలో ఎక్కువ మానవ వనరులు ఉన్నాయని, ఇతర దేశాలకంటే భారత్ లో పెట్టుబడులు లాభదాయకమని, ఏపీలో మరింత లాభదాయకమన్నారు. నిరంతరం విద్యుత్ పై వారం రోజుల్లోగా అనుమతులు మంజూరు చేస్తామని వారికి బాబు హామి ఇచ్చారు. -
జపాన్ వైపు ఏపీ చూపు..
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సేద్య పద్ధతుల్లో సహకారం అవసరం మూడో రోజు జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సేద్యపు విధానాల విషయంలో జపాన్ వైపు చూస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ అంశాల్లో సహకరించాలని కోరారు. జపాన్‌లోని ఫ్యుకోకా నగర ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లకు జపాన్ పెట్టుబడులు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. చంద్రబాబు జపాన్‌లో మూడో రోజు పర్యటన వివరాలను రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. చంద్రబాబు బృందం బుధవారం తొలుత ఫ్యుకోకా నగరంలోని ‘శాన్ నో స్టార్మ్’ రిజర్వాయర్‌ను సందర్శించింది. ఇక్కడ వరద నీటి నిర్వహణను చంద్రబాబు బృందం అధ్యయనం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో చర్చించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్యుకోకా వరద నీటి నియంత్రణ విధానాన్ని నూతన రాజధానితో పాటు 13 స్మార్ట్ నగరాల్లో అనుసరించడంపై అధ్యయనం చేస్తామన్నారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు స్మార్ట్ సిటీల అభివృద్ధికి జపాన్ సహకరించాలని కోరారు.ఐక్యరాజ్యసమితి గుర్తించిన 38 ఉత్తమ నగరాల్లో తమది ఒకటని ఫ్యుకోకా డిప్యూటీ మేయర్ అత్సుహికో సదకరి తెలిపారు. ఏపీ నూతన రాజధానిలో తమ విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో సహకరిస్తామని ఫ్యుకోకా పర్ఫెక్చర్ ఇంటర్నేషనల్ బ్యూరో డెరైక్టర్ అఖికో ఫ్యుకుషిమా తెలిపారు. అనంతరం చంద్రబాబు బృందం ఫ్యుకోకా టవర్‌ను సందర్శించింది. నకాటా వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం పరిశీలన అనంతరం ఫ్యుకోకాలోని నకాటా వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వ్యర్థాల నిర్వహణను స్థానిక అధికారులు వివరించారు. ఈ ఫ్యుకోకా మోడల్‌ను చైనా, ఇరాన్ తదితర దేశాల్లో అనుసరిస్తున్నట్లు వివరించారు. కిటాక్యుషు స్మార్ట్ గ్రిడ్ సందర్శన కిటాక్యుషు నగరంలోని విద్యుత్ స్మార్ట్ గ్రిడ్‌ను కూడా రాష్ట్ర బృందం సందర్శించింది. విద్యుత్ పొదుపు, 24 గంటల విద్యుత్ డిమాండ్‌ను ముందే అంచనా వేయటం, విద్యుత్ నిర్వహణ సమర్ధవంతంగా చేయటం, డిమాండ్ తగ్గితే వేరే గ్రిడ్లకు ఆ విద్యుత్‌ను మళ్లించటం, డిమాండ్ పెరిగితే వేరే గ్రిడ్ల నుంచి తీసుకోవడం వంటి వాటిని అధ్యయనం చేసింది. లో కార్బన్ సిటీగా పేరుపొందిన కిటాక్యుషు నగర మేయర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక్కడి గ్రీన్ సిటీ విధానం, పర్యావరణ పరిరక్షణ పద్ధతులపై చర్చించారు.చంద్రబాబు బృందం బుధవారం రాత్రికి జపాన్ రాజధాని నగరం టోక్యోకు చేరుకుంది. -
జపాన్ పెట్టుబడుల కోసం కేంద్రం ప్రత్యేక టీమ్
న్యూఢిల్లీ: భారత్‌లో జపాన్ పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వీలుగా కేంద్ర పరిశ్రమల శాఖ ‘జపాన్ ప్లస్’ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు దేశాల ప్రభుత్వ అధికారులు ఉంటారని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటన సందర్భంగా భారత్‌లో వచ్చే ఐదేళ్లలో 33.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణ సహకారాన్ని అందించనున్నట్లు జపాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ టీమ్ ఈ నెల 8 నుంచే కార్యరూపంలోకి వచ్చిందని డీఐపీపీ తెలిపింది. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన కెనిచిరో టోయోఫుకు దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బృందంలో ఇద్దరు జపాన్, నలుగురు భారతీయ అధికారులు ఉంటారని వెల్లడించింది. అదేవిధంగా కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఇండియా-జపాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పార్ట్నర్షిప్ పేరుతో మరో కీలక బృందాన్ని కూడా భారత్ ఏర్పాటు చేసింది. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాల సమన్వయం, పర్యవేక్షణలను ఈ గ్రూప్ నిర్వహిస్తుందని డీఐపీపీ వివరించింది.