breaking news
Janardhan Rao (45)
-
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత ఇంట్లో పోలీసుల సోదాలు
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు , అతని సోదరుడు జగన్మోహనరావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. జనార్ధన్,జగన్మోహనరావు కుటుంబాన్ని విచారించిన పోలీసులు. జనార్ధనరావు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడిగినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. జనార్ధనరావు రిమాండ్ లో ఉండగా కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడం పై పలు సందేహాలు వెలువడుతున్నాయి.ఎక్సైజ్ అధికారులు ఆయనను గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే, ముందస్తు సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందాలు జనార్ధనరావును పట్టుకున్నారు.విచారణలో జనార్ధనరావు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరిన్ని నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది -
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్‌రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్‌రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
అద్దేపల్లి ఫోన్ అదృశ్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో కరకట్ట బంగ్లా డైరెక్షన్‌తో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావుకు టీడీపీ పెద్దలతో లింకులు ఉన్నట్లు బహిర్గతం కావడంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయోనని ముఖ్యనేతలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ తరహాలో విస్తరించిన నేపథ్యంలో జనార్దనరావు నోరు తిప్పితే తమ కొంప కొల్లేరు అవుతుందని ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారు.నకిలీ మద్యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారు. జనార్దనరావు తమ డైరెక్షన్లో లొంగిపోయేలా డ్రామాకు తెర తీశారు. ప్రధానంగా నకిలీ మద్యం వ్యవహారంలో కరకట్ట బంగ్లాకు నెల వారీగా రూ.కోట్లాది ముడుపులు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లె జనార్దనరావు ఫోన్ తాజాగా అదృశ్యమైంది. జనార్దనరావును అరెస్టు చేసిన తరువాత ఫోన్ గురించి పోలీసులు ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని చెప్పినట్లు కట్టుకథ అల్లారు. లొంగిపోయే వరకు టచ్‌లోనే..! అద్దేపల్లె జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన తరువాత రాష్ట్రంలో పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపుల్లో తనిఖీలు చేశారు. అందులో వెల్లడైన విషయాలను వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టారు. దీనినిబట్టి కరకట్ట బంగ్లాతో పాటు పలువురు టీడీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. జనార్దనరావు ఫోన్ దొరికితే పలువురు టీడీపీ నేతలతో ఆయనకు ఉన్న లింకులు, ఫోన్ సంభాషణలు వెలుగు చూస్తాయని ముందు జాగ్రత్తగా మాయం చేసినట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే వరకు టీడీపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే కేసును నీరుగార్చే కుట్రలకు పదును పెట్టినట్లు సమాచారం. విదేశాలకు వెళ్లే సమయంలో మైలవరం ప్రజాప్రతినిధి బావ మరిదికి అద్దేపల్లి జనార్దనరావు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
నకిలీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జనార్థన్ ఫోన్ ఎక్కడ?
సాక్షి, అమరావతి: ఏపీలో నకిలీ మద్యం(AP Liquor case) కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నకిలీ మద్యం కేసులో టీడీపీ(TDP) గ్యాంగ్.. సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాని నిందితుడు, టీడీపీ నాయకుడు జనార్థన్ రావు ఫోన్ మిస్సింగ్ అని కొత్త కోణాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలను దాచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును(Janardhan Rao) అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు(AP Police) ఆరా తీశారు. అయితే, ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్ చేస్తున్నారు. ఇక, జనార్థన్ రావు ఫోన్ దొరికితే మరికొందరు టీడీపీ నాయకులు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఫోన్లో ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, ముంబై ఎయిర్‌పోర్టులో ఫోన్ పోయిందనే ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ సిండికేట్..ఇదిలా ఉండగా.. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్. -
సరిహద్దు తగాదాలో వ్యక్తి దారుణ హత్య
యనమదల(రామచంద్రపురం) : స్థల సరిహద్దు తగాదా వివాదంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామచంద్రపురం మండలం యనమదలలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాదే జనార్దనరావు(45)కు అదే గ్రామానికి చెందిన దారా అప్పారావుకు సరిహద్దు గొడవలున్నాయి. జనార్దనరావు ఇంటి వెనుక గల ఖాళీ ప్రదేశాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేశారు. దారా అప్పారావు ఇదే స్థలం పక్కన గల మరొకరి స్థలాన్ని కౌలుకు తీసుకుని పశువుల పాక వేసుకున్నాడు. జనార్దనరావు కొన ్న స్థలం పక్క నుంచే అప్పారావు పశువులను తీసుకు వెళుతుండేవాడు. దీంతో వీరి మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదిలా ఉండగా ఈ రెండు స్థలాల మధ్యలోని చింత చెట్టును దారా అప్పారావు తొలగించే ప్రయత్నం చేయగా జనార్దనరావు అడ్డుకున్నాడు. వీరి మధ్య వివాదం ముదరడంతో అప్పారావు, అతడి కుమారులు సింహాద్రి, చంటిబాబు, రాజశేఖర్‌లు కత్తితో జనార్దనరావుపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న మృతుడు జనార్దనరావు చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు పోలీసులకు సమాచారం అందించాడు. ద్రాక్షారామ, కె.గంగవరం ఎస్సైలు వంశీధర్, దుర్గారావు, సీఐ పి.కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. గ్రామంలో విషాదఛాయలు సౌమ్యుడిగా పేరొందిన జనార్దనరావు హత్యకు గురికావడంతో యనమదల గ్రామంలో విషాదం నెలకొంది. జనార్దనరావుకు భార్య సత్యవతి, తల్లి వెంకమ్మ, కుమారులు వెంకటేష్, దుర్గాప్రసాద్ ఉన్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


