
చంద్రబాబు పక్కనే ఉన్న నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దనరావు(ఫైల్)
నకిలీ మద్యం కేసులో ఏ1 టిడిపి నేత అద్దేపల్లి జనార్ధనరావు , అతని సోదరుడు జగన్మోహనరావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. జనార్ధన్,జగన్మోహనరావు కుటుంబాన్ని విచారించిన పోలీసులు. జనార్ధనరావు ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ పాస్ వర్డ్ అడిగినట్టు సమాచారం.
వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ పేరు చెప్పాలంటూ ఒత్తిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. జనార్ధనరావు రిమాండ్ లో ఉండగా కుటుంబ సభ్యులను పోలీసులు విచారించడం పై పలు సందేహాలు వెలువడుతున్నాయి.
ఎక్సైజ్ అధికారులు ఆయనను గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. జనార్ధనరావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే, ముందస్తు సమాచారం ఆధారంగా ఎక్సైజ్ బృందాలు జనార్ధనరావును పట్టుకున్నారు.
విచారణలో జనార్ధనరావు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరిన్ని నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది