breaking news
jai kishan
-
'జై ఆర్టీసీ, జై కిసాన్'
-
'జై ఆర్టీసీ, జై కిసాన్'
విజయవాడ: ఆర్టీసీ, రైతుల పరిస్థితి ఒకేవిధంగా ఉందని ఆర్టీసీ ఎండీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. జై ఆర్టీసీ, జై కిసాన్ అనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రోజు రోజుకు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీజిల్ ధర పెరుగుతున్నా టిక్కెట్లు పెంచలేని పరిస్థితివుందన్నారు. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆయన సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. ప్రభు త్వ లోపభూయిష్ట విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని, సంస్థను ఆదుకోవాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సమ్మె చేస్తామని ఈయూ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తెల్లారిన బతుకులు
శంషాబాద్, న్యూస్‌లైన్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతిలేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదనే స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొళ్లలు. గురువారం తెల్లవారుజామున ఆశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెత్తి చూడని అధికారులు.. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామికవాడలో రబ్బరు, ప్లాస్టిక్, టెక్స్ైటైల్స్,ఆయిల్ పరిశ్రమలు సుమారు 200 వరకు ఉన్నాయి. వీటిల్లో చాలా కంపెనీలకు అనుమతులు లేవు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్లాస్టిక్ పరిశ్రమలను నిషేధించినా అవి యథేచ్ఛగా నడుస్తున్నాయి. అశ్రీత పరిశ్రలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలకు వెల.. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిషా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు కూడా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యజమాన్యం నిర్లక్ష్యంతో ప్రవూదం పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. రసాయనాలను తరలించే భారీ పైపుల కిందనే కార్మికులు విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి. అరుుతే, రసాయనాలను తరలించే పైపులు కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. పైప్లైన్లకు ఉన్న లీకేజీలకు కూడా మరమ్మతులు చేసి నడిపిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. కంపెనీ యజమాని అరెస్టు.. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకొని కుటుంబంతో ఉంటున్నాడు.