బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ మొన్‌జురుల్ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్-2022 సందర్భంగా మొన్‌జురుల్ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్ జట్టు నాటి కెప్టెన్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. స్వతంత్ర విచారణ కమిటీఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్-ఏ- బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.జహనారా ఆరోపించినట్లుగానే మొన్‌జురెల్‌కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.నిషేధం విధిస్తున్నాంఈ క్రమంలో మొన్‌జురుల్ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.కాగా బంగ్లాదేశ్ మహిళల జట్టు సెలక్టర్, మేనేజర్‌గా మొన్‌జురుల్ వ్యవహరించాడు. గతేడాది జూన్ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ ఘాజి ఆష్రఫ్ హొసేన్ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చారిత్రాత్మక ముందుడుగుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక ముందడుగు వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్‌కు ఏప్రిల్ 4- 14 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా స్టార్