breaking news
Jagannath Puri Rath Yatra
-
అపచారం
భువనేశ్వర్: శ్రీ మందిరం ప్రాకారంలో భాగంగా జగతినాథుని వివిధ అలంకారాల శోభిత ప్రతిమల్ని సమగ్ర ఎయిర్ కండిషన్ జగన్నాథ్ వల్లభ్ సముదాయంలో అత్యంత అట్టహాసంగా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఏర్పాటు చేసింది.ఏడాది పొడవునా పలు పండగలు, ఉత్సవాలు, యాత్రలు సందర్భంగా స్వామి వివిధ రూపాల అలంకరణతో ఈ నమూనా మూర్తుల్ని ఎయిర్ కండిషన్ సముదాయంలో సందర్శకుల కోసం ప్రదర్శించారు. ఒకే చోట ఆరాధ్య దైవం వివిధ అపురూప అలంకరణ శోభతో తిలకించే భాగ్యం పట్ల అశేష భక్త, యాత్రికుల జనం సంతోషం వ్యక్తం చేసింది. పాలకులు మారడంతో తీరు మారింది. పవిత్రమైన జగతి నాథునితో అన్నా చెల్లెలు బలభద్ర స్వామి, దేవీ సుభద్ర ప్రతిమలు మరుగున పడ్డాయి. జగన్నాథ్ వల్లభ్ సముదాయం సెల్లార్ వాహన పార్కింగులో మూటలు గట్టి ఈ పవిత్ర ప్రతిమల్ని మరుగున పడేశారు.ఈ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. స్వామి 25 రకాల అలంకరణతో యాత్రికులకు అలరించిన నమూనా ప్రతిమలు నేడు ఇలా మరుగున పడడం అత్యంత విచారకరం. వీటిలో అత్యంత అరుదైన రఘునాథ అలంకరణ నమూనా కూడ మూటలో ముడి పడి పోయింది. ప్రత్యక్షంగా స్వామి అలంకరణని తిలకించే భాగ్యం లేని అపురూప రూపాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం, శ్రీ మందిరం యాజమాన్య యంత్రాంగం నిర్లక్ష్యపు చర్యలతో ఇలా అపవిత్రత మధ్య మగ్గిపోతున్నాయి. -
జగన్నాథ రూపాలు... చిత్రకారుడి కుంచెలో! (ఫొటోలు)
-
వారం-పర్వం
జూన్ 29 ఆదివారం: ఈ ఆదివారం మూడు ముఖ్యమైన పండుగల ప్రారంభానికి వేదిక కానుంది. పూరీ జగన్నాథ రథయాత్ర, ఆషాఢ బోనాలు, రంజాన్ నేటినుంచే ఆరంభం అవుతాయి. బోనాలు ప్రారంభం: తెలంగాణప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సిసలైన సంప్రదాయ వేడుక బోనాల పండుగ నేటినుంచి ఆరంభమవుతోంది. గ్రామదేవతలకు లక్షలాది భక్తులు ప్రతి ఆషాఢంలోనూ భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుని చల్లంగ చూడమని మొక్కే ఈ పండుగ ప్రారంభ సందర్భంగా భక్తులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలను సామూహికంగా సమర్పిస్తారు. పూరీ జగన్నాథ రథయాత్ర: జగత్తుకే నాథుడిగా కీర్తించబడే పూరీ జగన్నాథస్వామికి, ఆయన సోదరుడు బలభద్రుడికి, సోదరి సుభద్రకు ప్రతి ఆషాఢ శుద్ధ విదియరోజున అంగరంగవైభవంగా రథయాత్ర జరుగుతుంది. హైదరాబాద్ జూబిలీహిల్స్లో ఉన్న పూరీ నమూనా దేవాలయంతో సహా నగరంలో పలుచోట్ల ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. -
‘జగన్నాథుడికి’ కలప కొరత!
పూరి: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు అవసరమైన కలపకు కొరత ఏర్పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మూడు రథాలతో కూడిన యాత్రకు దేశం సహా విదేశాల నుంచి యాత్రికులు హాజరవుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29న ఈ రథాల తయారీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రథాలను రూపొందించేందుకు ఆలయ వర్గాలు సమాయత్తమయ్యాయి. అయితే, వీటి కోసం వాడే ప్రధాన దుంగలకు కొరత ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఎస్.కె. వశిస్ట్ అధ్యక్షతన అధికారులు గురువారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రథ చక్రాలను రూపొందించేందుకు కనీసం 42 భారీస్థాయి దుంగలు అవసరం కాగా, ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 దుంగలనే సరఫరా చేసిందన్నారు. ఏటా రూపొందించే రథాల కోసం వెయ్యి పైగా భారీ వృక్షాలను నరికివేయడంపై పర్యావరణ ప్రేమికులు సహా ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.