breaking news
j geetha reddy
-
రాజకీయాల్లో ' గీత ' దాటని నేత
మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహా మహిళ, చట్టసభల్లో ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సంవత్సరమే ఆమె జన్మించినప్పటికీ బాబ్డ్ హేర్ తో ఆధునికంగా అనిపించినా ఎంతో సంప్రదాయం కలిగిన మహిళా నేత. ప్రముఖ నాయకురాలు ఈశ్వరీబాయి కుమార్తె డా.జెట్టి గీతారెడ్డి. చిన్నప్పడు ఆమెకు అమ్మ మాటే వేదం. అందుకే తన తల్లి స్థాపించిన ఆసుపత్రిలో తన భర్తతో కలిసి చాలా రోజులు ప్రసూతి వైద్య నిపుణురాలుగా పనిచేశారు. డా. రామచంద్రారెడ్డిగాతో ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అలవరుచుకున్నారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. ఆస్టేలియా, లండన్‌లో పైచదువుల అనంతరం సౌది అరేబియాలో కొంతకాలం పనిచేశారు. మీలాంటి వారు ఇండియాలో గొప్పవైద్యులుగా పనిచేయాలని ఇందిరాగాంధీ పిలుపు మేరకు ఇక్కడకొచ్చి వృత్తిని కొనసాగించారు. రాజీవ్‌గాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ప్రవేశం చేశారు. కులరహిత సమాజానికి, మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి జహీరాబాద్ నియోజకవర్గాల్లో వరుసగా విజయం సాధించారు. వివిథ శాఖల మంత్రిగా పనిచేసిన మహిళగా గీతారెడ్డి గుర్తింపు పొందారు. కుటుంబ నేపథ్యం : పేరు : డా.జెట్టి గీతారెడ్డి జననం : 1947 జన్మస్ధలం : సికింద్రాబాద్ తల్లిదండ్రులు : ఈశ్వరీబాయ్, లక్మీనారాయణ్ కుటుంబం : 1971 డా. రామచంద్రారెడ్డితో ప్రేమ వివాహం, సంతానం ఒక కుమార్తె (మేఘన) చదువు : ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజ్, ఎంఆర్సిఓజి లండన్ నేపధ్యం : తల్లి ఈశ్వరీబాయ్ (రిపబ్లికన్ పార్టీ) వైద్యం, సాంఘిక సేవారంగాల్లో అవగాహన వ్యక్తిగత ఇష్టాలు : అభిమాన నేత : ఇందిరా గాంధీ, సోనియా గాంధీ స్పూర్తి ప్రధాత : ఈశ్వరి భాయి (అమ్మ) దైవం : సత్య సాయిబాబా నచ్చేరంగు : నలుపు మినహ అన్నిరంగులు నచ్చిన సినిమా : చివరకు మిగిలేది, మదరిండియా నటీనటులు : సావిత్రి , ఎన్టీఆర్, దిలీప్‌కుమార్ రాజకీయ నేపథ్యం : ► 1986 రాజీవ్‌గాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ► 1989 గజ్యేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం ► 1989-94 సాంఘిక సంక్షేమం, సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా ► 1994 గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి ► 1995-98 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ► 1999 గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి ► 2000-04 మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్నికల్లో విజయం ► 2004-09 టూరిజం శాఖామంత్రి ► 2009 జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం ► 2009-10 సమాచార, సాంస్కృతిక, ఎఫ్డీసీ, పురావస్తు, మ్యూజియమ్స్ & ఆర్కివ్స్, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ► 2010-14 భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి ► 2014 కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపు ► 2016 తెలంగాణ తొలి మహిళ పిఏసీ చెర్మైన్‌గా భాధ్యతలు ► 2018 కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గం పోటీలో ఉన్నారు అవార్డులు ► మహిళా శిరోమణి అవార్డు, యూనిటీ అవార్డు ఫర్ నేషనల్ఇంటిగ్రేషన్ ఫోరం, ఇందిరాగాంధీ సద్భావన అవార్డు, మిలీనియం స్టార్ అవార్డు, బెస్ట్ ఇన్వ్‌స్ట్‌మెంట్ స్టేట్ అవార్డు -కొండి దీపిక ( ఎస్ఎస్జె ) -
'సిద్ధిపేట నుంచే టీఆర్ఎస్ పతనం'
హైదరాబాద్: టీఆర్ఎస్ పతనం కేసీఆర్ స్వస్థలం సిద్ధిపేట నుంచే మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జె. గీతారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సిద్ధిపేట మున్సిపాలిటీలోని 34 వార్డులను ఏకగ్రీవంగా కైవశం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదని తెలిపారు. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 28 డివిజన్లలో పోటీ 12 వార్డులు గెలిచారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏవీ అమలుకావని అన్నారు. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులను (ఆరుగురు రెబల్ అభ్యర్థులతో కలిపి) టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్, బీజేపీలు రెండేసి స్థానాలకే పరిమితమయ్యాయి. ఎంఐఎం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరువకపోవడం గమనార్హం.