breaking news
IT Employees Associations
-
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదునైట్స్ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్ పేర్కొంది. మార్చి 25న బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్ఆర్, ఆన్‌బోర్డింగ్ హెల్ప్‌డెస్క్‌లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.కార్మిక శాఖను ఏం కోరిందంటే..విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్‌బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.విప్రో స్పందన ఇదీ..మరోవైపు, ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్‌లైన్ వెల్లడించలేదు. -
TCS Layoffs: ‘రాజీనామాలు మాత్రం చేయొద్దు’
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దుఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్‌ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. 👉 వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో -
టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకొచ్చిన అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్‌మెంట్ పాలసీని ఐటీ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) వ్యతిరేకిస్తోంది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తగ్గించుకునేందుకే టీసీఎస్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిందంటూ ఏఐటీఈయూ అభివర్ణించింది.టీసీఎస్ అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్‌మెంట్ పాలసీలో ఇకపై ప్రతి ఉద్యోగి ఏడాదికి 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. పని లేకుండా బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. ఆర్ఎంజీ నుంచి తగిన బిల్లబిలిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులకే బదలాయించాలనే దురుద్దేశం కూడా ఈ విధానంలో ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడల్లా కార్మిక వ్యతిరేక విధానమైన పనితీరు మెరుగుదల ప్రణాళిక (పీఐపీ) ద్వారా టీసీఎస్ యాజమాన్యం చేసే ప్రయత్నం ఇది" అని ఏఐటీఈయూ తెలిపింది.విడుదల తేదీకి ముందే కేటాయింపు కోసం రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో క్రియాశీలకంగా వ్యవహరించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఈ విధానం నొక్కి చెబుతోంది. ఫ్రెషర్స్ కూడా పని కేటాయింపు కోసం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు డిప్లాయిమెంట్ పాలసీని పాటించకపోతే చర్యలు తప్పవని కంపెనీ హెచ్చరిస్తోంది. "ఈ విధానం నిబంధనలను పాటించడంలో ఉద్యోగి విఫలమైనట్లయితే, సంస్థ క్రమశిక్షణా చర్యల ఫ్రేమ్‌వర్క్ ప్రకారం సేవల నిలిపివేతతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు సంస్థకు ఉంది" అని ఉద్యోగులకు పంపిన పాలసీ డాక్యుమెంట్ పేర్కొంది.ఈ చర్యను వ్యతిరేకిస్తున్న యూనియన్ "ఉద్యోగులకు తగినంత బిల్లబిలిటీని నిర్ధారించడానికి టీసీఎస్ ఆర్ఎంజీ బాధ్యత వహిస్తుంది. కార్మికుల శ్రమను దోపిడీ చేసి లాభాలు, సంపదను కాపాడుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతూ కార్మికుల హక్కులను కాలరాసే ఎంఎన్సీల విధానాలను ఏఐఐటీఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొంది. -
ఇన్ఫోసిస్‌లో 300 మంది ఫ్రెషర్ల తొలగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్ తెలిపింది. కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్ సంస్థ వివరణ ఇచ్చింది. మూడు నెలల క్రితమే చేరిక తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైటెస్) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్‌లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది. -
ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..!
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాప్-5 భారతీయ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు ఇన్ఫోసిస్‌తో సమానమైన టీసీఎస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయకూడదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కొత్త నిబంధనను తెచ్చింది. రాజీనామా చేసిన ఉద్యోగులకే కాకుండా కొత్తగా ఇన్ఫోసిస్‌లో జాయిన్ అయ్యే ఉద్యోగుల ఆఫర్ లెటర్లో కూడా ఈ నిబంధనను జోడించింది. ఆందోళనలో ఐటీ ఉద్యోగులు..! ఇన్ఫోసిస్ తెచ్చిన కొత్త నిబంధనపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం తలుపుతట్టింది. ఇన్ఫోసిస్ నిర్ణయంపై కార్మిక మంత్రిత్వశాఖకు ప్రముఖ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ఫిర్యాదు చేసింది.ఇన్ఫోసిస్ తెచ్చిన క్రూర నిబంధనపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఇన్ఫోసిస్ తెచ్చిన నిబంధన కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల హక్కులను నైతికంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. వలసలను ఆపేందుకు గానే..! భారత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు గణనీయంగా పెరిగింది. ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్ రేటు భారీగా ఉంది. గత 3 నెలల్లో 80,000 మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇక కంపెనీ అట్రిషన్ రేటు గణనీయంగా 27శాతంకు పెరిగింది. ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగుల వలసలను ఆపేందుకు గాను కంపెనీ ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్‌లోని అన్నీ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు ఇదే స్థాయిలో ఉండడం గమనార్హం. చదవండి: వరుసగా మూడోసారి రిలయన్స్ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్టెల్ -
పాయ్ వ్యాఖ్యలు బాధాకరం
బెంగళూరు : ఐటీ పరిశ్రమ ప్రముఖుడు మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐటీలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేస్తున్న వారు, భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారివెంట ఉన్న వారెవ్వరికీ ఉద్యోగాలు రాబోవని మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించడం చాలా బాధకరమని పేర్కొంటున్నాయి. ఈ కామెంట్లు ఉద్యోగుల రాజ్యాంగ హక్కులకు బహిరంగ ముప్పుగా ఉన్నాయని ఆల్ ఇండియా ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖ్విముద్దీన్ అన్నారు. ఐటీ కంపెనీలు అక్రమంగా చేపడుతున్న ఉద్యోగాల కోతపై తాము అంతర్జాతీయ కార్మిక సంస్ధ వద్దకు వెళ్తామని చెప్పారు. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీకి మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, హెచ్ఆర్ గా నిర్వర్తించిన పాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బెంగళూరు ఐటీ ఉద్యోగుల ఫోరమ్ రాజేష్ నటరాజన్ మండిపడ్డారు. ఐటీ పరిశ్రమలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుచేయాలనుకునేవారు, కొండంత ఉన్నదాన్ని గోరంత చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారికెవరూ సపోర్టు చేయొద్దని, వారితో వెళ్లేవారికి ఉద్యోగాలు రావని మోహన్ దాస్ పాయ్ హెచ్చరించారు. ఇటీవల ఐటీ కంపెనీల్లో చోటు చేసుకున్న భారీ ఉద్యోగాల కోతతో, ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటుచేసేందుకు సన్నద్దమవుతున్నారు. యూనియన్లు ఏర్పాటుచేసిన తమ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి తమపై వేటు వేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.


