breaking news
islamabad court
-
పాకిస్తాన్ మళ్లీ రక్తసిక్తం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కోర్టు కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ వెల్లడించారు.ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరితేరిందని పాక్ అధికారులు చెప్పారు. తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్ ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది.ఆత్మాహుతి దాడికి అఫ్గాన్‌లోని తాలిబన్ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది. -
Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి. దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్ దంపతులను ఆదేశించింది. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్ మాత్రం సొంత ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. -
కోర్టులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట
ఇస్లామాబాద్ కోర్టులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. తనపై నమోదైన తీవ్రవాద ఆరోపణలకు చెందిన ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించింది. ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇమ్రాన్‌కు పాక్ మిలటరీ, ప్రభుత్వం నుంచి కాస్తా ప్రశాంతత దక్కినటైంది. కాగా పీటీఐ చీఫ్‌కు 8 వరకు బెయిల్ లభించిందని ఆయన న్యాయమూర్తి మహమ్మద్ అలి బోఖారి తెలిపారు. కాగా పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి. పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసును విచారిస్తున్న ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ ముందు ఇమ్రాన్ హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు ముందే మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం 80 శాతం ఉందని పీటీఐ చీఫ్ హెచ్చరించారు. ఒకవేళ తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు. ఇదిలా ఉండగా అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ముందు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ అకౌంటబిలిటీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందింది. మే 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్ -
‘పక్కా స్కెచ్‌తో కోర్టులోనే చంపేందుకు కుట్ర’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. మరోసారి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగారు. కోర్టు హాల్లోనే తనను చంపేందుకు కుట్ర పన్నారని, అది అమలు కావడంలో విఫలం కావడంతోనే తాను ప్రాణాలతో ఉండగలిగానని ఆరోపించారాయన. ఈ మేరకు కోర్టు విచారణకు తాను వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతించాలంటూ పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అట్టా బందయల్కు లేఖ రాశారాయన. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనకు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయని, ఆ ఎఫ్ఐఆర్లను అన్నింంటిని ఒకచోట చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఖాన్. అలాగే ప్రాణ హాని నేపథ్యంలో తనను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారాయన. ఇక సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోర్టు ప్రాంగణంలోనే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. ఈ మేరకు ఆయన తన లేఖలో.. ‘‘శనివారం తోషాఖానా గిఫ్ట్ కేసుల్లో విచారణకు హాజరుకాగా.. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ బయట నన్ను చంపేందుకు ప్రణాళిక వేశారు. సుమారు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు నా చుట్టూ చేరారు. వాళ్లు నిఘా సంస్థల్లో పని చేసేవాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. వాళ్లే నన్ను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారు’’ అని ఆరోపించారాయన. ఇక.. కోర్టు కాంప్లెక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. పోలీస్ సిబ్బందే తనను చంపేందుకు కుట్రలో భాగం అయ్యారని, అక్కడ గొడవలు జరుగుతున్నట్లు సృష్టించి తనను చంపేందుకు కుట్ర చేశారని సీజేకి రాసిన లేఖలో ఆరోపించారాయన. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఉగ్రవాదం, హత్య, హత్యాయత్నం, దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నం.. ఇలా రకరాల అభియోగాలు నమోదు అయ్యాయి. The scenes I was confronted with as I entered the gates of Judicial Complex. Let there be no doubt that this force along with the 'Unknowns' - namaloom afraad - were there not to put me in jail but to eliminate me by staging a mock fight & pretending my death was an accident. pic.twitter.com/7Pt2zZLLqK — Imran Khan (@ImranKhanPTI) March 21, 2023 ఇదీ చదవండి: వేడి అలలు.. జీవజాలానికి ఉరితాళ్లు! -
అవన్నీ ఫ్లాప్ మూవీ స్టోరీలే: మాజీ ప్రధాని ఆగ్రహం
ఇస్లామాబాద్ : తనపై వెల్లువెత్తుతోన్న అవినీతి ఆరోపణలను ఫ్లాప్ మూవీ స్టోరీలతో పోల్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో పదవి కోల్పోయిన షరీఫ్ ఇటీవల 13వ సారి స్థానిక కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పనామా లీకేజీలో నిందితులుగా ఉన్న షరీఫ్ కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్ లు మాజీ ప్రధానితో కలిసి వచ్చి కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) షరీఫ్ పై నమోదైన కేసులను విచారిస్తోంది. కోర్టు విచారణ అనంతం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. నాపై చేస్తున్న ఆరోపణలు 1960లో భారీ బడ్జెత్‌తో తీయగా అట్టర్ ఫ్లాప్ అయిన మూవీలా ఉన్నాయన్నారు. మూవీ ఎంత బాగోలేకున్నా హిట్ అవుతుందని చెబుతారు. కానీ రెండో వారం పరాజయాన్ని నిర్మాత, దర్శకుడు, యూనిట్ ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. తనపై చేస్తున్న తప్పుడు విమర్శలు, ఆరోపణలు మొదట విజయవంతంగా కొనసాగినా.. చివరికి వాటిలో పస లేదని తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు షరీఫ్. మరోవైపు ఇస్లామాబాద్ కోర్టు షరీఫ్‌పై గతేడాది చివర్లో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థుల పైనా షరీఫ్ నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్థులు మా పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరో నాలుగు నెలలు వేచి చూస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పనామా పేపర్ల లీకేజీతో పాటు పలు అక్రమాస్తుల కేసుల్లో షరీఫ్ సహా ఆయన కూతురు, అల్లుడు నిందితులు కాగా, పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. -
పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం
-
పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం
పాకిస్తాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఫస్ట్ సెక్రటరీ మొబైల్ ఫోన్‌ను ఇస్లామాబాద్ కోర్టు స్వాధీనం చేసుకుంది. ఉజ్మా అనే భారతీయ మహిళ పెళ్లి చేసుకోడానికి ఇస్లామాబాద్ వచ్చి, తీరా అక్కడకు వచ్చిన తర్వాత తన భర్త తాహిర్ అలీకి అప్పటికే పెళ్లయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ కేసు ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా సాక్షిగా వచ్చిన భారత రాయబార కార్యాలయంలోని ఫస్ట్ సెక్రటరీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను కోర్టు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఒక్కసారిగా కలకలం రేపింది. పాకిస్తాన్ పౌరుడి చేతిలో మోసపోయిన భారతీయ మహిళకు ఆశ్రయం కల్పించే విషయంలో తన విధి నిర్వహణలో భాగంగా వచ్చిన ఒక దౌత్యవేత్త ఫోన్‌ను పాకిస్తాన్ అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ స్వదేశంలో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


