Invalid check
-
రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
చెక్ బౌన్స్ కేసులో మాల్యాపై నేరం రుజువు
మే 5న కోర్టులో హాజరు పర్చాలంటూ వారెంట్ సాక్షి, హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థను మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నేరం రుజువైంది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువైందని బుధవారమిక్కడి మూడో ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది. శిక్ష ఖరారు చేసే ముందు నిందితుడికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున మే 5న మాల్యాను హాజరుపర్చాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అదే రోజున శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి ఎం.కృష్ణారావు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు పన్నుల రూపంలో జీఎంఆర్ సంస్థకు కింగ్‌ఫిషర్ రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రాజీ ద్వారా రూ.22 కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ ముందుకు వచ్చిందని, ఇందుకు 45 చెక్కులు ఇచ్చిందని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశామని ఆయన వివరించారు. -
చెల్లనిచెక్కు కేసుల్లో నిందితులకు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్ష విధించడంతో పాటు రూ.5.90 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు.. కుత్బుల్లాపూర్‌కు చెందిన మధుకర్, సరూర్‌నగర్ క్రాంతినగర్‌కు చెందిన భీంరెడ్డి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం భీంరెడ్డి 2013 మార్చి, 15న మధుకర్ నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు పూర్తయ్యాక డబ్బులు చెల్లించాలని భీంరెడ్డిని కోరగా అతను హెచ్డీఎఫ్సీ చైతన్యపురి బ్రాంచికి చెందిన రూ.5 లక్షల చెక్కును మధుకర్ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును ఐసీఐసీఐ బ్యాంక్ బాలానగర్ బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో బౌన్స్ అయింది. నోటీసు పంపినా భీంరెడ్డి డబ్బులు స్పందించకపోవడంతో మధుకర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. మరో కేసులో... మరో చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.8.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వివరాలు... హస్తినాపురంకు చెందిన విజయేందర్‌రెడ్డి, చింతల్‌కుంట వివేకానందనగర్కాలనీకి చెందిన నర్సింగరావులు పరిచయస్తులు. నర్సింగరావు 2012 ఫిబ్రవరిలో విజయేందర్‌రెడ్డి నుంచి రూ.6.30 లక్షలను అప్పుగా తీసుకొని, మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిశాక డబ్బులు చెల్లించమని నర్సింగరావును కోరగా హెచ్డీఎఫ్సీ గడ్డిఅన్నారం బ్రాంచికి చెందిన రూ.6.30 లక్షల చెక్కును విజయేందర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును తన ఖాతాలో జమచేయగా చెల్లలేదు. నోటీసు పంపినా నర్సింగరావు డబ్బులు చెల్లించకపోవడంతో విజయేందర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.