breaking news
interfere
-
చట్టం, న్యాయస్థానాల తీర్పులు.. వాస్తవాలు
దేశంలో స్థిరాస్తుల హక్కులు, సరిహద్దుల తగాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు తరచూ పోలీసులను ఆశ్రయించడం లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేయడం, ఒక పక్షాన నిలవడం వంటి పరిణామాలు చూస్తుంటాం. అయితే, కేవలం సివిల్ స్వభావం కలిగిన ఆస్తి వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా? ఈ అంశంపై భారత రాజ్యాంగం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల స్పష్టమైన తీర్పులు ఏమి చెబుతున్నాయో చూద్దాం.కోర్టులకే పూర్తి అధికారంఆస్తి యాజమాన్య హక్కులు (Title Dispute), స్వాధీనం (Possession), హద్దులు లేదా వారసత్వ వివాదాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల మధ్య ఉండే పౌర హక్కుల వివాదాలను విచారించి పరిష్కరించే అధికారం కేవలం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంది. సివిల్ కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలపై పోలీసులు స్వయంగా పంచాయితీలు చేయడం, ఒక పక్షాన్ని ఖాళీ చేయించడం లేదా భూమి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చట్టవిరుద్ధం.పోలీసులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? (మినహాయింపు)సివిల్ వివాదాల్లో పోలీసుల పాత్ర అత్యంత పరిమితం. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు చట్టబద్ధంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.ఆస్తి వివాదం నెపంతో అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దాడి లేదా ఆస్తి ధ్వంసం వంటి క్రిమినల్ నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు.వివాదం తీవ్రరూపం దాల్చి భౌతిక దాడులు లేదా శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు శాంతి పరిరక్షణ కోసం నిరోధక చర్యలు తీసుకోవచ్చు.సివిల్ కోర్టు లేదా హైకోర్టు నిర్దిష్టంగా పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఆదేశాలను అమలు చేయడానికి పోలీసు బలగాలు సహకరించాలి.న్యాయస్థానాల హెచ్చరికలుఇటీవల అల్లాహాబాద్ హైకోర్టుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తమ తీర్పుల్లో ‘సివిల్ వివాదాల్లో పోలీసులు జడ్జిలుగా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశాయి. చట్టపరిధి దాటి సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటామని కోర్టులు హెచ్చరించాయి.బాధితులు ఏమి చేయాలి?ఆస్తి వివాదం ఎదురైనప్పుడు పోలీసులపైనే ఆధారపడకుండా తగిన ఆధారాలతో సివిల్ కోర్టును ఆశ్రయించి ‘ఇంజెక్షన్ ఆర్డర్’ లేదా 'స్టే' పొందడమే చట్టబద్ధమైన పరిష్కారం. ఒకవేళ పోలీసులు అక్రమంగా జోక్యం చేసుకుని వేధిస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందవచ్చు.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: శాసన సంబంధ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపునకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కోయంబత్తూర్కు చెందిన డాక్టర్ ఎస్.రాజశేఖరన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2017 బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదించగా రాజ్యసభలో పెండింగ్లో ఉంది. దీనిని వచ్చే శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదించే అవకాశం ఉంది. ‘చట్టసభల విధుల్లో మేం జోక్యం చేసుకోలేము. రాజ్యసభలో ఆ బిల్లు పెండింగ్లో ఉందంటే దానర్థం మేం జోక్యం చేసుకోవాలని కాదు. ఆ పని మేం చేయలేం’ అని స్పష్టం చేసింది. ‘పరిహారం చెల్లింపులో ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా రూ.2 లక్షల పరిహారం ఇస్తామంటే మేమేందుకు వద్దంటాం? అని ప్రశ్నించింది. -
ట్రిబ్యునల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు
-
లోకేశ్ కనుసన్నల్లోనే మంత్రుల పేషీ
-
లోకేశ్.. ఓకే అంటేనే..!
మంత్రుల పేషీల్లో నియామకాలన్నీ చినబాబు కనుసన్నల్లోనే... సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు ఇసుమంత స్వేచ్ఛ కూడా లేకుండాపోయింది. వారిపై నిఘా ఉంచేలా, ప్రతి కదలికనూ తెలుసుకొనేలా వారి కార్యాలయాల్లో నియామకాలు జరుగుతున్నాయి. చిన్న స్థాయి వారిని కూడా మంత్రులు సిఫార్సు చేసిన వారిని నియమించడంలేదు. అన్నీ చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘అభీష్ట’ం మేరకే జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రులు తమకు అనుకూలురైన, సమర్ధులని భావించిన అధికారులు, సిబ్బందిని పేషీల్లో నియమించుకోవడం సహజమే.ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఏ మంత్రి పేషీలో నియామకం అయినా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్నీ చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ మంత్రులు స్వతంత్రించి నియమించుకున్నా, వారిని ఏదో విధంగా వెనక్కి పంపుతున్నారు. లోకేశ్ సూచించిన వారినే తమ కార్యాలయాల్లో నియమించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. జూనియర్లే కాదు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ మంత్రుల పరిస్థితి కూడా ఇంతే. యనమల గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన పేషీలో ఒఎస్డీగా శ్రీనివాసరావు పనిచేశారు. 2004లో టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దగ్గర శ్రీనివాసరావు ఒఎస్డీగా చేరారు. అదీ.. యనమల సూచన మేరకే రఘువీరా నియమించుకున్నారు. మళ్లీ ఇప్పుడు యనమల ఆర్థిక మంత్రి కావడంతో, శ్రీనివాసరావును ఒఎస్డీగా నియమించుకున్నారు. దీనికి సీఎం అంగీకరించలేదు. కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేసిన వారిని మంత్రులు కార్యాలయాల్లో నియమించుకోవద్దని స్పష్టంచేశారు. సీఎం కార్యాలయం ఆదేశాలకు యనమల తలొగ్గి శ్రీనివాసరావును వెనక్కి పంపారు. ఇలా కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేశారనో, మరో కారణంతోనో మంత్రులు నియమించుకున్నవారిని వెనక్కి పంపుతున్నారు. ఈ విధానంపై మంత్రులు, అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను పార్టీలో చేర్చుకొని, మంత్రి పదవులిచ్చారని, కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేసిన అధికారులను పేషీల్లో నియమించుకుంటే వచ్చిన నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఆదేశాలను పాటించేది లేదని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా బాబు ముందే స్పష్టం చేశారు. గతంలో మంత్రయిన తోట నర్సింహం దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు మాణిక్యాలరావు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇందుకు అనుమతించాలని సీఎం ను మంత్రి కోరారు. ఆయన అంగీకరించలేదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని,అనుసరించాలని చెప్పారు. దీనిపై మాణిక్యాలరావు ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. అదే సమయంలో తోట నర్సింహం కూడా పక్కనే ఉన్నారు. తాను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకునే వ్యక్తి తోట నర్సింహం పేషీలో పనిచేశారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని మాణిక్యాలరావు సీఎంను ప్రశ్నించినట్లు సమాచారం. లోకేష్ ‘అభీష్ట’ం మేరకే అన్నీ జరుగుతుండటంపై అధికారవర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న రాజకీయ నేతలు టీడీపీలోకి వస్తే లేని అభ్యంతరం ఈ విషయంలో ఎందుకుండాలని వారి వాదన. వ్యక్తిగతంగా చెడ్డ పేరు ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుని అలాంటివారిని పక్కన పెట్టడంలో అర్ధం ఉంటుందని, అందరినీ ఒకే గాటన కట్టి పనికిరారని ముద్ర వేయడమే ఆవేదన కలిగిస్తోందని చెబుతన్నారు. మంత్రులపై నిఘా కోసమే ఇదంతా చేస్తున్నారన్న భావన అధికార, ఉద్యోగవర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.


