శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం | Can not interfere in legislative duty Supreme | Sakshi
Sakshi News home page

శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం

Aug 14 2018 2:53 AM | Updated on Sep 2 2018 5:18 PM

Can not interfere in legislative  duty Supreme - Sakshi

న్యూఢిల్లీ: శాసన సంబంధ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపునకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కోయంబత్తూర్‌కు చెందిన డాక్టర్‌ ఎస్‌.రాజశేఖరన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2017 బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దీనిని వచ్చే శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదించే అవకాశం ఉంది.  ‘చట్టసభల విధుల్లో మేం జోక్యం చేసుకోలేము. రాజ్యసభలో ఆ బిల్లు పెండింగ్‌లో ఉందంటే దానర్థం మేం జోక్యం చేసుకోవాలని కాదు. ఆ పని మేం చేయలేం’ అని స్పష్టం చేసింది. ‘పరిహారం చెల్లింపులో ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా రూ.2 లక్షల పరిహారం ఇస్తామంటే మేమేందుకు వద్దంటాం? అని ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement