ఢిల్లీలో తెలుగువ్యక్తి అవయవదానం
సాక్షి, న్యూఢిలీ: తాను మరణించినా ఇతరులకు ప్రాణం పోసి ఓ తెలుగు వ్యక్తి అమరుడయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఆనంద్‌బాగ్‌కు చెందిన కూరపాటి అరవింద్(శ్రీకాంత్) గుర్గావ్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగి. పనిచేస్తున్న సమయంలో మెదడు రక్తస్రావం కారణంగా సొమ్మసిల్లిపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. అరవింద్ అవయవాలను దానం చేయడానికి ఆయన కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. అనంతరం అరవింద్ గుండెను మరొకరికి అమర్చగా, రెండు కిడ్నీలను ఆర్మీ ఆసుపత్రికి దానం చేశారు. అరవింద్ భౌతిక కాయాన్ని హైదరాబాదుకు తరలించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాట్లు చేసింది.