breaking news
industries building
-
రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్‌గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్‌పూర్‌లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్‌లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్‌ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్‌కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్‌ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్‌కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్‌ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్‌ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో భాగంగా కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
స్వాతి సన్‌సోర్స్ దందా
పరిశ్రమ ఏర్పాటు చేస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. ఈ మాటలతో ముందుకొచ్చే సంస్థల పూర్వాపరాలు తెలుసుకోకుండానే అధికారులు రెడ్ కార్పెట్ పర్చేస్తున్నారు. వేలు కాదు.. లక్షలు కాదు.. కోట్లాది రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేస్తున్నారు. తీరా చూస్తే.. ఉపాధి దేవుడెరుగు, పరిశ్రమ ఊసే లేకుండా పోతోంది. అధికారుల సాక్షిగా.. దక్కించుకున్న స్థలంలో దందా సాగుతోంది. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ముసుగులో స్వాతి సన్‌సోర్స్ పవర్ లిమిటెడ్ పాగా వేసిన స్థలం విలువ అక్షరాలా రూ.100 కోట్ల పైమాటే. ఇదంతా ఏపీఐఐసీ అధికారులకు తెలియదా అంటే.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనే చెప్పాలి. అనంతపురం టౌన్/పెనుకొండ రూరల్: స్వాతి సన్ సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ కంపెనీ సూర్యరశ్మి నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ, అల్యూమినియం ప్లేట్లతో(సోలార్ ప్లేట్లు) పాటు వాటి విడిభాగాలను తయారు చేసే పరిశ్రమ. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ పరిశ్రమ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ)కి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ మేరకు అధికారులు పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ పక్కనున్న సర్వే నంబర్లు 85–1,2,4, 86–1, 87, 72–2, 72–3లలోని 45.17ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 2012 జూలై 26న కంపెనీకి సేల్ అగ్రిమెంట్ చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటి వరకు పరిశ్రమ ఊసే లేకపోవడం గమనార్హం. పరిశ్రమ స్థలంలో భవంతులు నిర్మించి అద్దెకు.. కేటాయించిన స్థలంలో నాలుగేళ్లుగా ప్రహరీ గోడ నిర్మించారు. ఇంతలోనే పెనుకొండ దగ్గరలో కియా పరిశ్రమ నెలకొల్పుతున్నట్లు ప్రకటిచండంతో పనులను వేగవంతం చేశారు. పెద్ద పెద్ద భవంతులను నిర్మించారు. పరిశ్రమ త్వరలోనే ప్రారంభం అవుతుందని నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురు చూశారు. భవంతులు కూడా పూర్తయ్యాయి. సోలార్ ప్లేట్ల తయారీకి అవసరమైన యంత్రాలను మాత్రం తీసుకురాలేదు. నిర్మించిన పెద్ద పెద్ద భవంతులను కియా పరిశ్రమ కోసం వచ్చిన కొరియన్స్‌కు నెలవారీ అద్దెకు ఇచ్చేశారు. ఇంతటితో ఆగకుండా కొరియన్స్ సౌకర్యార్థం అక్కడే పరిశ్రమ స్థలంలోనే ఒక రెస్టారెంట్‌ను నెలకొల్పేందుకు వేగంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. 190 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ఈ పరిశ్రమ నేడు కేవలం ఆ కంపెనీ యజమానికి మాత్రమే ఉపాధి కల్పిస్తోంది. ప్రతి నెలా దాదాపు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల మేర ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఆ కంపెనీ యజమాని పరిశ్రమ కోసం కేటాయించిన స్థలంలో ఇతర వ్యక్తులకు సైతం సబ్ లీజుకు స్థలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా.. : ఒక పరిశ్రమకు ఏ మార్కెట్ ధరకు స్థలాన్ని కేటాయించారో అందులో 15శాతం డబ్బు ముందుగా చెల్లించి సేల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండేళ్లలోపు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలి. ఏ ఉద్దేశంతో పరిశ్రమ స్థాపించారో ఆ మేరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ప్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత ఏపీఐఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిశ్రమను పరిశీలించి మిగిలిన మొత్తం ఏపీఐఐసీ పేరిట డీడీలు తీసిన తర్వాత పరిశ్రమ పేరిట కేటాయిం చిన స్థలానికి సేల్‌డీడ్ చేస్తారు. అయితే ‘స్వాతి సన్‌సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ యజమాని పరిశ్రమను స్థాపించనేలేదు. అయినా ఏపీఐఐసీ అధికారులు రూ.100కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎలాంటి పర్యవేక్షణ లేకుండా రూ.1.19కోట్లకు 26.04.2018న అప్పనంగా సేల్‌డీడ్ చేయడం గమనార్హం. విచారణ జరిపితేనే..: స్వాతి సన్‌సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూములు కట్టబెట్టడం వెనుకు అసలు రహస్యం దాగి ఉంది. రెండేళ్లలోపు పరిశ్రమను స్థాపించకపోతే సదురు కంపెనీ పేరిట స్థలాన్ని కేటాయించిన సేల్ అగ్రిమెంట్‌ను సైతం క్యాన్సిల్(రద్దు) చేసే అధికారం ఏపీఐఐసీకి ఉంది. అయితే 2012 నుంచి నేటి వరకు 6ఏళ్లుగా పరిశ్రమను స్థాపించకపోయినా అధికారులు భూములను సదురు పరిశ్రమకు అప్పన్నంగా ఎలా కట్టిబెట్టారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే యజమాని గుట్టు, అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు కథేంటి? ♦ ఇప్పటి వరకు పరిశ్రమ జాడ లేదు. ♦ కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటు.. పెద్ద భవంతులను నిర్మించారు. ♦ కియా పరిశ్రమకు చెందిన కొరియన్స్‌కు అద్దెకిచ్చారు. ♦ తాజాగా అదే స్థలంలో రెస్టారెంట్ నిర్మాణం. ♦ నెలవారీగా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల మేర ఆదాయం. పూర్తి స్థాయిలో పరిశీలిస్తా స్వాతి సన్‌సోర్స్ పరిశ్రమను ఏర్పాటు చేయకుండానే భూములు కట్టబెట్టారనే విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో రికార్డులు తెప్పించి పరిశీలించి అధికారులతో పూర్తిస్తాయి విచారణ జరిపిస్తా.– ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పరిశీలన తర్వాతే సేల్‌డీడ్ స్వాతి సన్‌సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పరిశీలించిన తర్వాతే సేల్ డీడీ చేశాం. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు సైతం కొనసాగుతున్నాయి.– నాగేశ్వరరావు, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ అనంతపురం -
అద్దె రూ.1.. హంగులకు రూ.10 కోట్లు!
అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న దుబారా ఖర్చుల జాబితాలో తాజాగా మరో భారీ కేటాయింపు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే భవనాల ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న బాబు సర్కార్ పరిశ్రమల కార్యాలయానికి అద్దెకు నెలకు ఒక్క రూపాయిగా నిర్ణయించడంతో పాటు వాటి హంగులకు రూ.10 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కాంట్రాక్టును ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడలోని ముత్యాలంపాడుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన ఓ అంతస్తును పరిశ్రమలశాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 10 వేల చదరపు అడుగులు ఉండే ఈ భవనానికి నామమాత్రపు (నెలకు ఒక్క రూపాయి) అద్దె చెల్లిస్తారు. ఈ భవనాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించింది. భవన అంతస్తు ఆధునీకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చించాలని ప్రతిపాదించింది. ఇంత పెద్ద మొత్తం నిధులు వెచ్చిస్తున్న పరిశ్రమల శాఖ పనులన్నీ ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లకే అప్పజెప్పేందుకు సిద్ధమైంది. మార్చిలోగా ఇది పూర్తి చేయాల్సి ఉన్నందున కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


