breaking news
industrial areas
-
పారిశ్రామిక స్థలాలకు డిమాండ్.. సీబీఆర్ఈ నివేదిక
న్యూఢిల్లీ: పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి–జూన్) మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో లీజింగ్ కార్యకలాపాలు 13 శాతం పెరిగి 14 మిలియన్ చ.అ.లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో ఇది 11 మిలియన్ చ.అ.లుగా నమోదైంది. సరఫరాలో అంతరాయాలను అధిగమించే దిశగా తమ వినియోగదారులకు చేరువలో ఉండే ప్రాంతాలను ఎంచుకునేందుకే లాజిస్టిక్స్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని నివేదిక వివరించింది. కొన్ని సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరులో అత్యధికంగా (50 శాతం) లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో అర్ధ సంవత్సర ప్రాతిపదికన అద్దెలు 2 శాతం నుంచి 14 శాతం దాకా పెరిగాయి. -
భారీ పరిశ్రమలపై కరోనా ప్రభావం
-
జీడిమెట్ల పారిశ్రమిక వాడలొ అగ్ని ప్రమాదం
-
పారిశ్రామికవాడగా మారుస్తా
సాక్షి,మోటకొండూర్ : ఆలేరును పారిశ్రామిక వాడగా తయారు చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని తన సొంత గ్రామం అయిన ఇక్కుర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పీసరి తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కుర్తి, మాటూర్, అమ్మనబోలు గ్రామాల్లో మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు నియోజకవర్గం అన్ని వసరులు కలిగినా హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గల కన్వీనర్ కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భానోతు శత్రునాయక్, జిల్లా కార్యదర్శి బొబ్బలి ఇం ద్రారెడ్డి, శిరిగె శ్రీనివాస్, కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు బొట్టు అబ్బ య్య, బీసీ మోర్చ జిల్లా అధ్యక్షులుæ బడుగు జహంగీర్, జోరుక ఎల్లేష్, సిరబో యిన మల్లేష్, మల్లేష్, శ్రీను పాల్గొన్నారు. మార్పు కోసం వస్తున్నాం.. యాదగిరిగుట్ట : అభివృద్ధిలో వెనుకబడిన ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వస్తున్న బీజేపీని ఒక్క సారి ఆశీర్వదించండి అని ఆ పార్టీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో మార్పు తీసుకువచ్చి వారిని చైతన్యం చేయడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం మండల అధ్యక్షుడు బెలిదె అశోక్ కుమార్, కళ్లెం మహేష్, రచ్చ భరత్, మిట్ట ప్రసాద్, గుజ్జ శేఖర్‌తో పాటు మాసాయిపేటకు చెం దిన 100 మంది యువకులు బీజేపీలో చేరారని వెల్లడించారు.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవుల నరేందర్, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి రాయగిరి రాజు, తొడిమే రవీందర్‌రెడ్డి, రంగ సత్యం, భాస్కర్‌రెడ్డి, చిత్తర్ల కృష్ణ, రొయ్యల నగేష్, బాలస్వామి, ప్ర శాంత్, శ్రీశైలం, ఠాగూర్ నవీన్, రాము, కోల అనిల్ పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి తుర్కపల్లి : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతురి శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానికంగా బీజేపీ మండల కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మోదీని కించపరుస్తున్నారని తెలి పారు. కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, రావుల నరేందర్, యాట పెంటయ్య, కొక్కొండ లక్ష్మీనారాయణ, శత్రునాయక్, శేఖర్‌యాదవ్, మల్లేశ్‌యాదవ్, ఆకుల సైదులు, రమేశ్ పాల్గొన్నారు. -
పొగమంచు కాదు.. పొగే
హైదరాబాద్: మీరు ఈ ఫోటోలలో చూస్తుంది తెల్లవారుజామున కురిసే పొగమంచు కాదు, గాలిలోని హిమబిందువులు అంతకన్నా కాదు.. ఇదంతా పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారకమైన పొగ. ఇలాంటి దృశ్యాలు పారిశ్రామిక వాడలైన జీడిమెట్ల, గాంధీనగర్‌లలో నిత్యకృత్యమయ్యాయి. స్థానిక పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కొన్ని పరిశ్రమలు పరిమితికి మించి విషవాయువులను పర్యావరణంలోకి వదులుతున్నా.. కాలుష్యాన్ని అరికట్టాల్సిన పీసీబీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తమకు ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.