breaking news
induced
-
‘కోట్లు కుమ్మరించారు.. ఢిల్లీలో వర్షం కురవలేదు’
ఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు బ్రేక్ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో నిన్న (అక్టోబర్ 28, మంగళవారం)రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు.ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్ 28) కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్‌ను చేపట్టారు. -
కంప్యూటర్ అధిక వాడకంతో సమస్యలే..!
ఆధునిక కాలంలో కంప్యూటర్లు.. వ్యక్తి జీవితంలో ప్రధాన వస్తువులుగా మారిపోయాయి. కంప్యూటర్ లేకుండా ఏ పనీ పూర్తి కావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంప్యూటర్ ప్రధానవస్తువైపోయింది. అయితే కంప్యూటర్ అధిక వినియోగం ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చొని పనిచేసేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ప్రతిరోజూ కంప్యూటర్ తో పనిచేయాల్సి రావడం ఆధునిక జీవితంలో తప్పని పరిస్థితిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కళ్ళకు ప్రమాదమేనంటున్నారు. కళ్ళు లాగడం, నొప్పి, కంటినుంచీ నీరు కారడం, మంటలు వంటి అనేక సమస్యలతో పాటు కొందరికి దృష్టిలోపం కూడ ఏర్పడుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలం కంప్యూటర్ ముందు కూర్చొనే వారిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల శరీరం బరువెక్కడం, ఉబకాయం సమస్యతోపాటు సోమరులుగా కూడ మారే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్లను వాడటంవల్ల దీర్ఘ కాల రోగాలైన ఉబ్బసం, రక్తపోటు వంటి రోగాలు సంక్రమించడంతోపాటు కొందరిలో నిరాశ చుట్టుముట్టి మానసిక వ్యాధులకు కూడ దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో ఆహారం పట్ల విముఖత ఏర్పడితే, మరి కొందరిలో అదేపనిగా తినే అలవాటుకూడ వస్తుందని, దీనివల్ల ఊబకాయ సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చోవడం వల్ల ఒళ్ళు నొప్పులు, మెడనొప్పులు, స్పాండిలైటిస్ వంటివి కూడ ప్రధాన సమస్యలుగా మారతాయని వైద్య నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు. కంప్యూటర్లో పనిచేసే వ్యక్తులకు దీర్ఘకాలిక తలనొప్పులు సంక్రమించే అవకాశం కూడ ఉంది. అటువంటి నొప్పి ఒక్కోసారి డిప్రెషన్ కు కూడ దారితీస్తుంది. నొప్పుల వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం, అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఏర్పడతాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే తప్పనిసరిగా కంప్యూటర్ తో పనిచేయాల్సి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నవాస్తవం బయటపడిందని పరిశోధకులు చెప్తున్నారు. తప్పనిసరిగా వ్యాయామం చేయడం, గంటకోసారైనా కాసేపు అటూఇటూ తిరగటం, వాడే సమయంలో అప్పుడప్పుడూ నీటితో ముఖం కడుక్కోవడం, ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తుండటం, స్క్రీన్ కు వీలైనంత దూరంగా కూర్చోవడం, వంటివి కంప్యూటర్ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక ముఖానికి ఎదురుగా లైట్ లేకుండా చూసుకోవడం, మానిటర్ కళ్ళకు ఎదురుగా సమానమైన ఎత్తులో ఉండేలా చూస్కోవడం, మౌస్ ప్యాడ్ వాడటం, తక్కువ రేడియేషన్ ఇచ్చే మానిటర్స్ ను వాడటం చేయాలంటున్నారు. కంటికి ఒత్తిడి తగ్గేలా యాంటీ గ్లేర్ స్క్రీన్ల వాడకం వంటి కొన్ని కనీస జాగ్రత్తలను పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండొచ్చని కొంతైనా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు.


