breaking news
Indian-America
-
సీమా వర్మ ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్: అమెరికాలో కీలకమైన హెల్త్ కేర్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతికి చెందిన సీమా వర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ట్రంప్ యంత్రాంగంలో అడుగిడిన రెండో ఇండో– అమెరికన్‌గా వర్మ గుర్తింపు పొందారు. 55– 43 ఓట్ల తేడాతో సెనేట్ ఆమెను ఎన్నుకున్నట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. దీంతో 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే ‘మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్ల’కు అధిపతిగా వర్మ బాధ్యతలు నిర్వహించనున్నారు. యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంక్షేమాన్ని అందించే దిశగా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా ఇండియానా సహా పలు రాష్ట్రాలోని ప్రైవేట్ ఆరోగ్య రంగ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
మన బంధం ప్రపంచం కోసమే
భారత-అమెరికా సంబంధాలపై మోదీ వాషింగ్టన్: ప్రపంచం కోసం భారత్-అమెరికా కలసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల సంబంధాలు ఒకరికోసం ఒకరు కాకుండా ఇద్దరూ కలిసి ప్రపంచంకోసం పనిచేయాల్సిన కొత్త శకంలోకి ప్రవేశించాయని యూఎస్ కాంగ్రెస్‌లో జరిగిన వీడ్కోలు సమావేశంలో తెలిపారు. ‘భారత్-అమెరికా మరింత సన్నిహితంగా పనిచేయాలి. బలమైన బంధాలను ఏర్పర్చుకోవాలి. ఈ రెండు దేశాలు విలువలను పంచుకోవటం ద్వారా ప్రపంచానికి లాభం జరగాలి. అమెరికాకు మావల్ల ఏం లాభం, మావల్ల అమెరికాకు ఏం లాభం అని ఆలోచించే స్థాయిని ఎప్పుడో దాటేశాం’ అని మోదీ అన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, పేదరికం, ఆరోగ్య రంగం.. సమస్య ఏదైనా సరే ప్రపంచానికి మేలుచేసే అంశాలపై భారత్-అమెరికా చిత్తశుద్ధితో కలసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ అమెరికా పర్యటన చాలా గొప్పగా, సానుకూలంగా సాగిందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని ప్రసంగం మంత్రముగ్ధులను చేసిందన్నారు. కాగా, అమెరికా ప్రత్యేక అంతర్జాతీయ భాగస్వామిగా భారత్‌ను గుర్తించాలంటూ ఇద్దరు అమెరికా చట్టసభ్యులు గురువారం ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. పాక్ ఆందోళన: భారత-అమెరికా బంధం బలపడటంపై పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమున్నప్పుడే అమెరికా తమ వద్దకు వస్తుం దని.. పనిలేనప్పుడు విస్మరిస్తోందని విమర్శించిం ది. దీనిపై అమెరికాకు తమ నిరసన తెలియజేస్తామని పాక్ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. భారత్, ఎన్ఎస్జీ.. మధ్యలో చైనా వియన్నా/న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వానికి ఏకాభిప్రాయం కోసం భారత్ అన్ని దేశాల మద్దతు కూడగడు తుండగా.. భారత మోకాలడ్డుతోంది. 48 మంది సభ్యులున్న ఎన్ఎస్జీలో భారత సభ్యత్వంపై నిర్ణయించేందుకు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశాలు గురువారం మొదలయ్యాయి. అయితే ఇప్పటికే మెజారిటీ దేశాలు భారత్‌కు బాసటగా నిలిచాయి. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సభ్యదేశాలకు రెండు పేజీల లేఖ రాశారు. దీనికి ఆయా దేశాలు మద్దతు ప్రకటించాయి. కానీ.. చైనా భారత అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్పీటీ) పై సంతకం చేయలేదనే కారణాన్ని సాకుగా చూపిస్తోంది. సభ్యదేశాల్లో ఏ ఒక్కరు వ్యతిరేకించినా భారత్ ఎన్ఎస్జీలో చేరటం అసంభవమే.