breaking news
India-Pakistan talks
-
భారత్, పాక్‌పై ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పాత పాటే పాడారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే, కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ తెలిపారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపామన్నారు. భారత్-పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా.. ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని చెప్పారు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.Trump just reminded India who’s boss again. He said I stopped war b/w India , Pakistan but dropped a bonus 5 Indian jets shot down ⚡️. Sorry Don it’s 6-Nill 💀 pic.twitter.com/ookpeprp9K— Awais 🐺 (@awais4226) July 19, 2025భారత్-పాక్ మధ్య కాల్పులు ఆగితే, అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్, తన బుద్ధి మార్చుకోవడం లేదు. గతంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకే ఫోన్లో చెప్పానని మోదీ స్పష్టం చేశారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఆ సమయంలో తన జోక్యమేమీ లేదని.. భారత్-పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని చెప్పిన ట్రంప్.. మరోసారి మాట మార్చి వ్యాఖ్యలు చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌నకు మతి మరుపు ఏమైనా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. -
భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇరు దేశాల్లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న నేపథ్యంలో యుద్ధం అనేది మార్గం కాదన్నారు. పాకిస్తాన్ మినరల్స్ సమ్మిట్ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొన్నారు.. ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. -
నా చేతుల్లో.. మోదీ చేతుల్లో ఉండదు..
ఇస్లామాబాద్: అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఒకసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో గానీ ఉండదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఒకసారి యుద్ధం ప్రారంభమయ్యాక అది ఎక్కడ వరకు వెళ్తుందో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలతోపాటు ఇప్పటివరకు జరిగిన యుద్ధాలన్నీ అవగాహనలేమి కారణంగానే ప్రారంభమయ్యాయని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌ను చర్చలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బుధవారం ఆయన పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాక్ యుద్ధవిమానాలను తమ వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ఒక పైలట్ జాడ తెలియడం లేదంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడటం గమనార్హం. ‘మీరు మా(పాక్) దేశంలోకి వస్తే.. మేము మీ(భారత్) దేశంలోకి రాగలమని తెలపడానికే బుధవారం నాటి సైనిక చర్యలు. భారత్‌కు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశాం. ఒక భారత పైలట్ ప్రస్తుతం మా వద్ద ఉన్నారు. ఇరు దేశాలు కూర్చొని.. చర్చల ద్వారా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దుకుందాం. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను అర్థం చేసుకోగలం. పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ప్రస్తుత పరిస్థితిని భారత్ మరింత దిగజారుస్తుందని నాకు అనుమానం ఉంది. భారత్ గనుక దాడులకు ఉదృతం చేస్తే.. మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం ’అని ఇమ్రాన్ స్పష్టం చేశారు. -
'పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనతో విఘాతం'
లాహోర్: పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటన.. భారత్, పాకిస్థాన్ శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలు సరైన దిశలో సాగుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి ఘటన జరగడం ప్రతికూల ప్రభావం చూపించిందని షరీఫ్ అంగీకరించారు. పాకిస్థాన్ రేడియా ఈ విషయాలను వెల్లడించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ దాడి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు పాక్ ఓ ఉన్నతస్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన దౌత్య చర్చలు వాయిదా పడ్డాయి. -
పార్లమెంటుకు 'రహస్య భేటీ' సెగ!
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) మధ్య బ్యాంకాక్ లో జరిగిన రహస్య సమావేశం సోమవారం పార్లమెంటును కుదిపేసే అవకాశం కనిపిస్తున్నది. గత కొన్నాళ్లుగా ఉప్పు-నిప్పులా ఉన్న దాయాదుల దౌత్య సంబంధాల్లో నాటకీయ మలుపులకు కారణమైన ఈ భేటీ పట్ల ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఈ రహస్య సమావేశం మోసం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది భారీ మోసమే. ఈ మోసంతో ప్రభుత్వ తీరు బట్టబయలైంది' అని కాంగ్రెస్ నేత మనీష్ తివారి మండిపడ్డారు. 'ఎందుకంతా రహస్యం? చర్చలకు సంబంధించి చాలా అవకతవకగా వ్యవహరించారు' అని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్ రాయ్ విమర్శించారు. రెండువారాల కిందట పారిస్ లో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బ్యాకాంక్ లో ఇరుదేశాల ఎన్ఎస్ఏల భేటీకి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రవాదం, శాంతిభద్రతలు, జమ్ముకశ్మీర్ వంటి అనేక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది పాక్ లో జరుగబోయే సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యేందుకు వీలుగా ఈ భేటీ ఏర్పాటుచేశారని, ఈ సమావేశానికి ప్రధాని మోదీయే చొరవ తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.