breaking news
iit toppers
-
కోడింగ్‌ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ప్రపంచాన్ని శాసిస్తున్నదని, భవిష్యత్ ఉద్యోగాలన్నీ దానివేనని అంతా భావిస్తున్న తరుణంలో దేశంలోని ఐఐటీ ప్రవేశాల్లో సరికొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఐఐటీ టాపర్లు మాత్రం కంప్యూటర్ సైన్స్‌కు బదులుగా ‘సివిల్ ఇంజనీరింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, భవనాలు, నగరాల నిర్మాణం వైపు ఈ టాలెంటెడ్ విద్యార్థులు ఎందుకు అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఏఐ భయాలు.. మౌలిక వసతుల జోరుగత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ)ఐఐటీ అడ్మిషన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ సెకన్ల వ్యవధిలో క్లిష్టమైన కోడింగ్‌ను పూర్తి చేస్తుండటంతో, రాబోయే 10-15 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందోననే అనిశ్చితి ఐఐటీ టాపర్లలో మొదలైంది. ఇదే సమయంలో భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో లైన్లు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్వహణకు వేలాది మంది ఇంజనీర్ల అవసరం ఉండటంతో, సివిల్ ఇంజనీరింగ్‌ను టాపర్లు సురక్షితమైన కెరీర్ ఆప్షన్‌గా భావిస్తున్నారు.జీతాల తేడాలున్నా మారని ట్రెండ్ప్లేస్మెంట్ల పరంగా చూస్తే ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాలదే పైచేయిగా ఉంది. ఉదాహరణకు 2026 క్యాంపస్ సెలక్షన్స్ లో ఐఐటీ రూర్కీకి చెందిన డేటా సైన్స్, ఏఐ మొదటి బ్యాచ్ విద్యార్థులు 100 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల సగటు ప్యాకేజీ రూ. 46 లక్షలుగా ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 17.2 లక్షలు మాత్రమే దక్కింది. అయినప్పటికీ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐ శాసించే ప్రమాదం ఉండటంతో, లాంగ్ టర్మ్ భద్రత కోసం టాపర్లు సివిల్ వైపే మొగ్గు చూపుతున్నారు.రెండు రంగాల జీవనశైలి.. విభిన్నంసివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే వారు ప్రాజెక్ట్ సైట్లలో తిరుగుతూ, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. తాము నిర్మించిన వంతెనలు, రోడ్లు కళ్లముందే సాకారం కావడం వీరికి ఒక తృప్తిని ఇస్తుంది. అదే సమయంలో ఏఐ ప్రొఫెషనల్స్ పూర్తిగా ఆఫీస్ లేదా రిమోట్ వర్క్ చేస్తూ, రోజంతా కంప్యూటర్ల ముందే గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి సరికొత్త రంగాలతో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సొంతంగా స్టార్టప్‌లు పెట్టుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి. -
ఆ పిల్లలకు ఐఐటీ ఫీజులు మాఫీ
కూలీల పిల్లలు ఐఐటీలో ప్రవేశం దక్కించుకున్నా, ఫీజులు కట్టలేని దుస్థితి ఉండటంపై మోదీ సర్కారులోని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వాళ్లకు అడ్మిషన్ ఫీజును మొత్తం రద్దు చేయడంతో పాటు.. తర్వాత కావల్సిన సెమిస్టర్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, మెస్ ఫీజులు అన్నింటికీ స్కాలర్షిప్ కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్ గఢ్ జిల్లా రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష్ ఐఐటీలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు. అయితే, వాళ్లకు ఒక్కొక్కళ్లకు అడ్మిషన్ ఫీజు రూ. 30 వేలు, తొలి సెమిస్టర్ ఫీజు రూ. 20 వేల చొప్పున ఇద్దరికీ కలిపి లక్ష రూపాయలు ముందే కట్టాల్సి వస్తోంది. ఈ దుస్థితిని మీడియా విస్తృతంగా వెలుగులోకి తెచ్చింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించి సోదరులిద్దరికీ ఫీజులు మాఫీ చేశారు. అదే విషయాన్ని ఆ కుటుంబానికి కూడా ఆమె తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. దాంతో ఆ సరస్వతీ పుత్రులకు లక్ష్మీకటాక్షం కూడా దొరికినట్లయింది. వాళ్ల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. @ratigirl informed family dat registration fees will b waived off n wil b eligible for scholarships dat cover tuition, mess n other charges — Smriti Z Irani (@smritiirani) June 20, 2015


