ఇదే లోకం...
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ శిష్యుడు టి.కరణ్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. అశోక్చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఎస్పీ నాయుడు నిర్మించారు. సుమన్, నరేశ్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదో అందమైన ప్రేమకథ.
ప్రియుడికి ఇచ్చిన మాట కోసం తనవారిని వదులుకుని వచ్చి, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ ఇది. కథపై నమ్మకంతో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో ఓ మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి, అరకులో చిత్రీకరణ జరిపాం. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది’’ అని ఎస్పీ నాయుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: కె. శివ.