ఇదే లోకం... | Ido Prema Lokam Telugu Movie | Sakshi
Sakshi News home page

ఇదే లోకం...

Sep 16 2016 11:42 PM | Updated on Sep 4 2017 1:45 PM

ఇదే లోకం...

ఇదే లోకం...

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ శిష్యుడు టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశీ,

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ శిష్యుడు టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై ఎస్‌పీ నాయుడు నిర్మించారు. సుమన్, నరేశ్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదో అందమైన ప్రేమకథ.
 
 ప్రియుడికి ఇచ్చిన మాట కోసం తనవారిని వదులుకుని వచ్చి, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ ఇది. కథపై నమ్మకంతో నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘మా బ్యానర్‌లో ఓ మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి, అరకులో చిత్రీకరణ జరిపాం. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుంది’’ అని ఎస్‌పీ నాయుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: కె. శివ.
 

Advertisement
 
Advertisement
Advertisement