breaking news
ICET Schedule
-
ఆగస్టు 19 నుంచి ‘సెట్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఈఏపీ సెట్–2021 సహా వివిధ సెట్ల షెడ్యూళ్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఆగస్టు 19 నుంచి 25 వరకు జరగనుందన్నారు. ఏపీఈఏపీ సెట్ గతంలో ఏపీ ఎంసెట్‌గా ఉండేది. ఈఏపీ సెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వెల్లడించారు. -
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల..
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 7 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. పరీక్ష ఫీజును 650గా నిర్ణయించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా జూన్ 30 వరకు-250 అపరాధ రుసుము, జులై 15 వరకు-500 అపరాధ రుసుము, జూలై 30 వరకు-1000 అపరాధ రుసుముతో తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఆగస్టులో మూడు సెషన్లలో ఐసెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే కేవలం అన్లైన్ ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం విద్యాశాఖ ఐసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు, ఇక నోటిఫికేషన్లు ఎలా? -
ఐసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. ఫిబ్రవరి 28 న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వెల్లడించారు. మే 19న పరీక్ష నిర్వహిస్తామని, అదే నెల 31వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.