breaking news
Hydroelectric projects
-
రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం పలు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే. ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు. -
ఏపీలో ఏడు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌క్యాప్) రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వీటి సామర్థ్యం 6,300 మెగావాట్లు. వీటి ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నెడ్‌క్యాప్ టెండర్లు పిలిచింది. ఏడు కంపెనీలు సాంకేతిక బిడ్‌కు అర్హత సాధించాయి. త్వరలో ఆర్థిక బిడ్ తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు చేపడతామని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. కోతలకు అవకాశం లేకుండా.. పీక్ డిమాండ్ (ఎక్కువ వినియోగం ఉండే సమయం)లో విద్యుత్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంటే కోతలకు ఆస్కారం ఉండదు. సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి సమయంలో వినియోగం తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇలా.. నీటి రిజర్వాయర్ల దగ్గర ఎత్తయిన ప్రదేశంలో ప్రత్యేకంగా నీటి నిల్వ కోసం ఓ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. కిందకు వెళ్లిన నీటిని పంపుల ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్‌లోకి పంపుతారు. నాన్ పీక్ అవర్స్ (డిమాండ్ లేని సమయం)లో సౌర, పవన విద్యుత్‌తో దిగువన ఉన్న నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు జల విద్యుత్‌కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో డిమాండ్ ఉండే సమయంలో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనే ఇబ్బంది తప్పుతుంది. సౌర, పవన విద్యుత్‌లనూ మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ కేంద్రాల కాలపరిమితి దాదాపు 80 ఏళ్లు. నిర్మాణ వ్యయం తొలి 25 ఏళ్లలోనే తీరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చౌకగా జలవిద్యుత్ అందుతుంది. కాగా రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 32 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నట్లు గుర్తించారు. ప్రాంతం జిల్లా సామర్థ్యం గండికోట రిజర్వాయర్ వైఎస్సార్ 600 అవుకు రిజర్వాయర్ కర్నూలు 800 సోమశిల రిజర్వాయర్ నెల్లూరు 1,200 చిత్రావతి రిజర్వాయర్ అనంతపురం 500 ఎర్రవరం విశాఖపట్నం 1,000 బోదూరుగెడ్డ రిజర్వాయర్ విజయనగరం 1,200 కర్రివలస విజయనగరం 1,000 -
పర్యావరణంపై నిర్లక్ష్యం!
ప్రకృతి పట్ల మనిషి చేసిన అపచారం పర్యవసానంగా ఉత్తరాఖండ్‌లో పెను విషాదం సంభవించి అప్పుడే ఏడాదైంది. నిరుడు జూన్ 15 కాళరాత్రి మొదలైన కుంభవృష్టి ఆ మర్నాడంతా కొనసాగడంతో ఆ రాష్ట్రంలోని చమోలీ, రుద్రప్రయాగ, ఉత్తరకాశి, పితోర్‌గఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని అనేకానేక నదులు కట్టలు తెంచుకుని జనావాసాలపై విరుచుకుపడ్డాయి. దాదాపు పదివేలమంది మరణించారని జాతీయ విపత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అంచనావేయగా... 4,251 మంది చనిపోయారని, మరో 1,497 మంది ఆచూకీ లేకుండా పోయారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్లినవారితోసహా ఎన్నో రాష్ట్రాల యాత్రికులు న్నారు. యాత్రికులు మాత్రమే కాదు...వీరిపై ఆధారపడి జీవికను వెతుక్కునే స్థానికులు వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విలయంపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. మందా కిని, అలక్‌నందా నదులపై ఉన్న 24 జలవిద్యుత్ ప్రాజెక్టుల వల్లనే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉన్నదా అనే సంగతిని తేల్చమన్నది. కమిటీలోని మెజారిటీ సభ్యులు ఈ ప్రాజెక్టులన్నిటినీ నిలిపేయవలసిం దేనని అభిప్రాయపడ్డారు. దీనిపై పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పంద నేమిటో ఇంకా తెలియాల్సే ఉన్నది. ఈ ఏడాదికాలంలో బాధిత కుటుం బాలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా విఫ లమైంది. కానీ, పునర్నిర్మాణం కోసమని వేల కోట్లరూపాయలు ఖర్చు చేశారు. రహదారులు, వంతెనల నిర్మాణం పనులు సాగుతున్నాయి. కానీ, విషాదమేమంటే ఈ పునర్నిర్మాణమంతా ఎప్పటిలానే పర్యా వరణాన్ని పట్టించుకోకుండా... దానికి వీసమెత్తు విలువీయకుండా సాగుతున్నది. పర్యావరణాన్ని కాపాడాలంటే, దాని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఏకరువు పెట్టిన అంశాలన్నీ కాగితాల్లో భద్రంగా ఉండిపోయాయి. వాటిని ఎవరైనా చదివారో లేదో కూడా అనుమానమే. ఈ విలయం మానవ తప్పిదం పర్యవసానమేనని గుర్తించి ఒక్క ఉత్తరాఖండ్‌ను మాత్రమే కాదు... హిమవ న్నగాల సమీపాన ఉండే రాష్ట్రాలన్నిటా ఎక్కడెక్కడ హఠాత్తుగా వర దలు పోటెత్తవచ్చునో అంచనా వేయాలనుకున్నారు. అలాంటి ప్రాంతాల్లో తగిన మార్పులు చేయాలనుకున్నారు. కానీ అవేమీ అమలుకాలేదు. రోడ్ల నిర్మాణం మొదలుకొని జల విద్యుత్తు ప్రాజెక్టుల వరకూ అభివృద్ధి ప్రక్రియలో విజ్ఞానశాస్త్ర భాగస్వామ్యాన్ని పెంచాలను కున్నారు. అందులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని నదుల గమనాన్ని అధ్యయనం చేయించారు. నదీ గమనానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్తు ప్రాజెక్టుల గురించిన వివరాలూ రూపొందాయి. అయితే ఆ ప్రాజె క్టులను పూర్తిగా తొలగించడానికి లేదా కనీసం కుదించడానికి పాల కులు అంగీకరించలేదు. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన నిపు ణులు రెండు కీలకమైన సూచనలు చేశారు. అడ్డూ ఆపూ లేకుండా విస్త రిస్తున్న జల విద్యుత్తు ప్రాజెక్టులకూ, యాత్రికుల కోసమంటూ నిర్మి స్తున్న రహదారుల నిర్మాణానికీ కళ్లెం వేయాలని చెప్పారు. మిగిలిన వాటి సంగతలా ఉంచి ఈ రెండింటి విషయంలోనూ జాగ్రత్తలు తీసు కుంటే మరో ప్రమాదాన్ని నివారించడానికి వీలవుతుందని సూచిం చారు. అయితే, జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ఆలోచన ఆగలేదు. యమునా వ్యాలీలో ఈమధ్య ఒక జల విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతి లభించడమే ఇందుకు తార్కాణం. ఉన్నవాటినే తగ్గించాలని చెబు తుంటే కొత్త ప్రాజెక్టులు అవతరిస్తున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్ అనే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తంతు. జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసమని నిర్మించే సొరంగాలు, జలాశయాలు నదుల సహజ గమ నాన్ని అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు మొత్తుకున్నా ఫలితం లేదని దీన్నిబట్టి అర్థమవుతుంది. పుణ్య క్షేత్రాలనూ, తీర్థాలనూ సందర్శించి పునీతులమవుదామని వచ్చేవారివల్ల ఉత్తరాఖండ్‌కు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తు న్నది. పర్యాటకం అనేది ఇప్పుడక్కడ ప్రధాన ఆదాయ వనరైంది. కానీ అలాంటివారి ప్రాణాలకు పూచీపడేలా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఒక ఘోరకలి జరిగిన తర్వాతనైనా కర్తవ్య నిర్వహ ణపై శ్రద్ధవహించొద్దా? కొత్త జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో ఇంత ఆసక్తి కనబరిచిన ఉత్తరాఖండ్ వాతావరణ స్థితిగతులను అంచ నావేసే రాడార్లను సమకూర్చుకోవడంలో విఫలమైంది. నిరుడు ప్రమా దం సంభవించినప్పుడు కీలకమైన ప్రాంతాల్లో రాడార్లను ఏర్పాటుచే స్తామని, వాతావరణ అధ్యయనానికి అవసరమయ్యే ఇతర యంత్రా లను తెప్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇంతవరకూ వాటి ఆచూకీ లేదు. వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఇప్పటికీ న్యూఢిల్లీ, పాటియాలాల్లోని వాతావరణ కేంద్రాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతున్నది. అరణ్యాల విధ్వంసం, కొండలనూ, గుట్టలనూ నా శనం చేయడం, నదుల ప్రవాహాన్ని అడ్డుకోవడం వంటి చర్యలవల్లనే ప్రకృతి కన్నెర్రజేస్తున్నదని చెబుతున్నా అది ప్రభుత్వాల ముందు బధిర శంఖారావమే అవుతున్నది. ఏ నదికైనా అటూ ఇటూ ఉండే 10 కిలో మీటర్ల దూరాన్ని పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా పరిగణించా లన్న నిబంధనలున్నా వాటి అమలును పర్యవేక్షించే నాథుడు లేడు. ఉత్తరాఖండ్ విషాదం నుంచి మనం ఎలాంటి గుణపాఠాలూ నేర్చు కోలేదని అక్కడ సాగుతున్న తంతు నిరూపిస్తున్నది. అక్కడ మాత్రమే కాదు... అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈ విష యంలో జనం చైతన్యవంతమై ప్రభుత్వాలను నిలదీస్తే తప్ప వారిలో మార్పు రాదు. అందుకు అవసరమైన కార్యాచరణే ఉత్తరాఖండ్ మృతులకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది.