breaking news
Hyderabad Race Club
-
దగ్గుబాటి కల్యాణ వైభోగమే...
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం. నాగచైతన్య, సమంత వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్ -
ఏపీలో హైదరాబాద్ రేస్ క్లబ్‌కు అనుమతి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలులో రేస్ కోర్స్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ రేస్ క్లబ్ ద్వారా గుర్రపు పందేలు, బెట్టింగులు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలోనే రెండు రాష్ట్రాలోన్లూ ప్రస్తుతం బెట్టింగ్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ రేస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు కూడా. -
రేస్‌క్లబ్ ట్రయినర్ బలవన్మరణం
మలక్‌పేట్‌లోని హైదరాబాద్ రేస్‌క్లబ్(హెచ్చార్సీ)లో ట్రయినర్‌గా పనిచేసే నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి హెచ్చార్సీలోని తన గదిలో ఆయన ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన సిబ్బంది నిర్వాహకులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న ఛాదర్‌ఘాట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నారాయణరావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి!
సాక్షి, హైదరాబాద్: కొందరు వ్యక్తుల ప్రైవేటు సామ్రాజ్యంగా మారిన హైదరాబాద్ రేస్ క్లబ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకీల సహకారంతో ఏటా రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తూ నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్న రేస్‌క్లబ్‌ను తన నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రేస్‌క్లబ్ నిర్వాహకులు చేస్తున్న బెట్టింగ్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్- 1939’లోని లొసుగులను సరిదిద్ది.. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో గుర్రపు పందాలు సాగేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక, హోం శాఖల కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్లతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రేస్క్లబ్తో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న బెట్టింగ్‌ల తీరుతెన్నెలు, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నైలోని రేస్కోర్సుల్లో ఉన్న పన్ను విధానాలను అధ్యయనం చేయనుంది. అలాగే ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించి కంప్యూటరైజేషన్ అవకాశాలపై కూడా ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. అనంతరం రేస్‌క్లబ్‌పై ప్రభుత్వ నియంత్రణ పెరిగే చర్యలను అధికారికంగా చేపట్టనున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. బు‘కీ’లే కీలకం: ఏటా 300 రోజుల పాటు హైదరాబాద్ రేస్‌క్లబ్ ఆధ్వర్యంలో గుర్రపు పందాలు సాగుతాయి. మలక్‌పేట రేస్‌క్లబ్‌లో జరిగే పందాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, మైసూర్, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, పుణెల్లో జరిగే పందాలకు కూడా ఇంటర్వ్యూనర్ బెట్టింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా అధికారికంగా టికెట్లతో కూడిన బెట్టింగ్ జరుగుతుంది. అదే సమయంలో రేస్క్లబ్కు సమాంతరంగా 23 మంది బుకీలతో బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగుతుంది. లెసైన్సుడ్ బుకీలుగా ఉన్న వీరి ద్వారా నల్లధనం చలామణి అవుతుంది. ఎలాంటి టికెట్లు లేకుండా కాగితం మీద రాసే అంకెల ఆధారంగా ఈ బెట్టింగ్ సాగుతుంది. రూ. 5వేలు బెట్టింగ్ కాసే వారికి రూ.500 అని రాసిన కాగితం ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తారు. రోజు రూ.3 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు 12%పన్ను కింద వాణిజ్యపన్నుల శాఖకు నెలకు రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తోంటే, 23 మంది బుకీలు సంవత్సరానికి రూ 5. కోట్ల వరకు చెల్లిస్తుండటం గమనార్హం. రేస్‌క్లబ్ అధికారికంగా చేసే వ్యాపారం కంప్యూటర్ బిల్లింగ్‌లో ఉండగా, బుకీల నల్ల వ్యాపారం మొత్తం చిత్తు కాగితాలపై సాగుతుంది. రెండు నెలల క్రితం అధికారులు రేస్‌క్లబ్‌పై దాడులు నిర్వహించగా, ఆరుగురు బుకీలురూ. 50 లక్షలు బెట్టింగ్ ద్వారా సమకూర్చుకొని రూ. 7 లక్షలకు అధికారికంగా లెక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో బుకీలతో రేస్‌క్లబ్ పాలకమండలి కుమ్మక్కై బెట్టింగ్ దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.