breaking news
husband drink
-
Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్లను నేర్చుకుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్గా మారింది. ‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు. -
భర్త ఒట్టు వేసి మరిచాడని..
హైదరాబాద్ : మద్యం సేవించనని భార్యపై ఒట్టు వేసిన భర్త మద్యం తాగి వచ్చాడని మనస్తాపంతో భార్య తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం..హన్మకొండకు చెందిన అనూష (30) జనగాంకు చెందిన రాజు (35) దంపతులు. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. కాగా బతుకుదెరువు కోసం కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చి ఎల్.బి.నగర్లో నివాసముంటున్నారు. రాజుకు సొంత కారు ఉంది. కారు నడుపుతుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రాజు తాగుడుకు బానిసకావడంతో కొన్ని రోజుల క్రితం తాగనని భార్య అనూషపై ఒట్టు వేశాడు. ఆదివారం తిరిగి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనూష ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజు అడ్డుకుంటుండగా రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.