భర్త ఒట్టు వేసి మరిచాడని.. | woman suicide attempted in hyderabad neredmet due to husband drink | Sakshi
Sakshi News home page

భర్త ఒట్టు వేసి మరిచాడని..

Nov 21 2016 7:34 PM | Updated on Sep 4 2017 8:43 PM

భర్త మద్యం తాగి వచ్చాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

హైదరాబాద్‌ : మద్యం సేవించనని భార్యపై ఒట్టు వేసిన భర్త మద్యం తాగి వచ్చాడని మనస్తాపంతో భార్య తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఎస్‌ఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం..హన్మకొండకు చెందిన అనూష (30) జనగాంకు చెందిన రాజు (35) దంపతులు. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. కాగా బతుకుదెరువు కోసం కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చి ఎల్.బి.నగర్‌లో నివాసముంటున్నారు. రాజుకు సొంత కారు ఉంది. కారు నడుపుతుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా రాజు తాగుడుకు బానిసకావడంతో కొన్ని రోజుల క్రితం తాగనని భార్య అనూషపై ఒట్టు వేశాడు.

ఆదివారం తిరిగి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనూష ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజు అడ్డుకుంటుండగా రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement