breaking news
Hurricane Maria
-
డొమినికాపై విరుచుకుపడ్డ ‘మారియా’
-
డొమినికాపై విరుచుకుపడిన ‘మారియా’
► పెనుగాలులతో బుల్లిద్వీపం అల్లకల్లోలం శాన్ జువాన్: పెనుతుపాను మారియా చిన్నద్వీపమైన డొమినికాపై విరుచుకుపడింది. అత్యంత ప్రమాదకరమైన ఐదో కేటగిరీలో ఉన్న ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవలి ఇర్మా తుపాను ఈ ద్వీపంపై ఇటీవల విరుచుకుపడి విధ్వంసం సృష్టించడం తెలిసిందే. తాజాగా మారియా తుపాను కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. బుధవారంనాటికి ఈ తుపాను çప్యూర్టోరికోను తాకే అవకాశం ఉంది. ‘తుపాను ప్రభావం కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ‘ఇక మనం దేవుడి దయవల్ల బతికి బట్ట కట్టాల్సిందే’ అంటూ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెరిట్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలను హెచ్చరిస్తూ ఆయన ఫేస్బుక్లో అనేక పోస్టులు పెట్టారు. ఇళ్లు, భవంతుల పై స్టీలుతో ఏర్పాటుచేసిన పైకప్పులు గాలి తీవ్రతతో కొట్టుకుపోతున్న దృశ్యాలను కూడా తాను చూడాల్సివస్తుందేమోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు,. అరగంట తర్వాత ఆయన మరో పోస్టు కూడా పెట్టారు. ‘మా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంటిలోకి వరద నీరు కూడా వచ్చింది. అయితే భద్రతాసిబ్బంది నన్ను కాపాడారు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. పెనుతుపాను నేపథ్యంలో పాఠశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ ప్రజలకు సూచించారు. అనేక ప్రాంతాలు నీటమునిగిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. -
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
సాక్షి, ఫ్యూర్టో రికో: సరిగ్గా రెండు వారాల క్రితం ఇర్మా హరికేన్ భీభత్సం కరేబియన్ దీవులను కకావికలం చేసేసి అక్కడి నుంచి అమెరికాపై తన ప్రతాపాన్ని చూపించేసింది. విలయతాండవ ఉధృతి త్వరగానే తగ్గినప్పటికీ.. నష్టం నుంచి బయటపడేందుకు మరికొన్ని రోజలు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో పెను తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరియా తుఫాన్ ఈ ఉదయం తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. గంటకు 165 మైళ్ల (215 కిలోమీటర్ల) వేగంతో కూడిన గాలులు వీయటం ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కేటగరీ 5 కింద తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఆగ్నేయ సఫిర్ సింప్సన్ ప్రాంతం నుంచి మొదలైన ఈ తుఫాన్ బుధవారం ఉదయంలోగా ఫ్యూర్టో రికో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. డొమినికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్న 72,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. నార్త్ కరోలినాకు నుంచి లీవార్డ్ మార్టినిక్, పోర్టారికో, యూఎస్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్స్ పై మరియా ప్రభావం చూపనుంది. గత 85 ఏళ్లలో అతి శక్తివంతమైన తుఫాన్ ఫ్యూర్టో రికోను తాకబోతున్నట్లు వారంటున్నారు. మరోవైపు హరికేన్ జోస్ కూడా ప్రచండ గాలులతో అమెరికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, మరియా అట్లాంటిక్ సముద్రానికి నాలుగో అతి భయంకరమైన హరికేన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యేడాది 13 తుఫాన్లు అట్లాంటిక్ నుంచి ప్రారంభమై వివిధ దేశాలపై తమ ప్రభావం చూపాయి.