breaking news
hundi theft
-
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు. నెలరోజుల క్రితం ప్రముఖ బుక్కరాయసముద్రం శ్రీ శ్రీ ముసలమ్మ పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ జరిగింది. ఈ క్రమంలో దోచేసిన నగదును మళ్లీ ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. అందుకు గల కారణాల్ని వివరిస్తూ డబ్బుతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.‘దొంగతనం చేసిన నాటి నుంచి ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా లేదు. తప్పు తెలుసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బును వాడుకున్నాం. క్షమించండి’ అంటూ ఆ లెటర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగిలించిన సొమ్ము రూ.లక్షా 86 వేలుగా ఆలయ అధికారులు లెక్కతేల్చారు. హుండీని చోరీ చేసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్రఇక దొంగతనం జరిగిన ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉండటంతో చర్చకు దారితీసింది. ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
వరంగల్ లో భక్తి దొంగ మొక్కి హుండీ ఎత్తుకపోయిండు ఏకంగ
-
దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్
భోపాల్: రాత్రి వేళ్లల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీ ఎత్తుకెళ్లిన సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో జరిగిన ఈ హుండీ చోరీ అందులో ప్రత్యేకం. అర్ధరాత్రి గుడికి కారులో వచ్చిన ఓ దొంగ.. ముందుగా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి హుండీని మాయం చేశాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ‘దేవుడా నన్ను క్షమించు నీ హుండీని ఎత్తుకెళ్తున్నా’ అని ఆ దొంగ ప్రార్థన చేశాడేమో అని వీడియో చూసినవారు అనుకుంటున్నారు! జబల్పుర్ గౌర్ చౌకిలో ఉన్న హనుమాన్ ఆలయానికి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కారులో వచ్చాడు దొంగ. అంతా దీపావళి హడావుడిలో ఉండగా.. తన చేతివాటాన్ని చూపించాడు. తెల్లవారి ఓ భక్తుడు గుడికి వెళ్లగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. చేతికి విలువైన గడియారం ధరించిన వ్యక్తి గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలో గత ఆగస్టులో జరిగిన చోరీలాగే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ -
రామాలయంలో చోరీ
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని రామాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించి హుండీని కొల్లగొట్టుకుపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి కమిటీకి తెలిపారు. కమిటీ వారు ఈ చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుండీలో నగదు ఎంత మొత్తంలో ఉందన్న విషయం ఇంకా తెలియరాలేదు.