breaking news
Hud hud
-
హుద్ హుద్ ఇళ్ల నత్తనడక
♦ ఈ ఏడాది చివరికి పూర్తికావడం డౌటే ♦ రూ.52.61కోట్లు మాత్రమే ఖర్చు ♦ జిల్లాలో నిర్మించతలపెట్టినవి 6వేలు ♦ పరిపాలనామోదం ఇచ్చినవి 4996 పూర్తయినవి 941 ♦ వివిధ దశల్లో ఉన్నవి 1665 ♦ ఇంకా మొదలు పెట్టనవి 2326 హుద్‌హుద్ బాధితులు నేటికీ నిలువు నీడ లేకుండా పరాయి పంచన రోజులు గడుపుతున్నారు. ఈరోజు వచ్చేస్తాయి..రేపొచ్చేస్తాయి అన్న ఆశతో కళ్లల్లోఒత్తులేసేకుని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాతలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన నిధులతో చేపట్టిన ఈ ప్రత్యేక గృహనిర్మాణాన్ని కూడా సర్కార్ పూర్తి చేయలేకపోతోంది. సాక్షి, విశాఖపట్నం: స్థలాల గుర్తింపు...లబ్ధిదారుల ఎంపికలో జరిగిన జాప్యంతో ఈ ప్రాజెక్టు అమలు హుద్‌హుద్ అనంతరం ఆర్నెళ్లకు కానీ కార్యరూపం దాల్చలేదు. ముంబైకి చెందిన కంపెనీకి తొలుత రూ.560కోట్లతో మూడు జిల్లాల పరిధిలో 10వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఒక్క విశాఖలోనే ఆరువేల ఇళ్లు నిర్మించాలని తలపోశారు. తొలిదశలో 3216ఇళ్లు నిర్మాణానికి గతేడాది మేలోనే టెండర్లు ఫైనలైజ్ చేశారు. యలమంచలిమండలం కొత్తూరుతో సహా జీవీఎంసీ పరిధిలోని 12 ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. అత్యాధునిక ప్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చెప్పిన ప్రకారం మూడు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్-12 నాటికైనా తొలిదశ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు. పనులు ప్రారంభమై 16నెలలు కావస్తున్నా..పూర్తి కాని దుస్థితి. సీఎం డాష్‌బోర్డులో పొందుపరిచిన వివరాల ప్రకారం అనకాపల్లి, భీమిలితో పాటు జీవీఎంసీ పరిధిలో 4210 ఇళ్లు మంజూరు చేయగా..వాటిలో కేవలం 936 ఇళ్లు మాత్రమే పూర్తి చేయ గలిగారు. 1624 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. 1586 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు. అర్బన్‌లో రూ.184.39కోట్ల అంచనాతో చేపట్టగా ఇప్పటి వరకు కేవలం రూ.52.61కోట్లుమాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇక గ్రామీణ ప్రాంతంలో 786 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా..కేవలం ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. 41 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా..740 ఇళ్లు అసలు ప్రారంభమే కాలేదు. వీటితో పాటు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ సొంత నిధులతో చేపట్టిన హుద్‌హుద్ ఇళ్లు నిర్మాణం మాత్రం కొలిక్కి వస్తున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. -
విశాఖలో హుదూద్ వినాయకుడు
-
ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు
మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : రాష్ర్టంలోని 329 ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రూ.13 కోట్లతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌లో రూ.350 కోట్లతో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేడతామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,400 కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో 2,400 పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ర్టంలో 13 వేల గ్రామ పంచాయతీలను ప్రణాళికపరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీ ఉపాధి నిధులు రూ.1680 కోట్లతో గ్రామాల్లో చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిర్మాణదశలో ఉన్న 789 పనులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో రూ.7.8 కోట్లతో ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో రోడ్లు వేస్తామన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో రూ.220 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.5కోట్ల 20 లక్షలతో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామన్నారు. రాష్ర్టంలో తొలి విడతగా 6 లక్షల తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పంచాయతీరోడ్ల మరమ్మతులకు రూ.150 కోట్లు మంజూరు కాగా, వీటిలో నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.35 కోట్లు కేటాయించామన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. -
అకాల వర్షం...అపార నష్టం
♦ కళ్లాలపై పంటలు.. ఆందోళనలో అన్నదాతలు ♦ నక్కపల్లిలో 80 మి.మీ.వర్షపాతం ♦ 5వేల ఎకరాల్లో పంటలకు నష్టం ♦ మరో రెండు రోజులు కురిస్తే మరింత కష్టం సాక్షి, విశాఖపట్నం : మొన్న వడగండ్ల వాన..నేడు అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన భారీవర్షం అన్నదాతల ఆశలను చిది మేసింది. హుద్‌హుద్ దెబ్బకు విలవిల్లాడిన జిల్లా రైతులు ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత కనివినీ ఎరుగని వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రెండోపంటసాగు చేస్తే చేతి కంది వచ్చే సమయంలో ్రపకృతి ప్రకోపానికి తల్లడిల్లిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి సుమారు ఐదువేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లాలో సరాసరిన 10.5 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అత్యధికంగా నక్కపల్లి మండలంలో 80.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పెందుర్తి మండలంలో ఒక మిల్లిమీటర్ వర్షపాతం నమోదైంది. ఈసీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో నక్కపల్లి తర్వాత జి.మాడుగులలో 53.8, హుకుంపేటలో 49.6, అనంత గిరిలో 34.6,అచ్యుతాపురంలో 34.2, మునగపాకలో 31, ఎస్.రాయవరంలో 23.4, చోడవరం లో 22.8, అరకులోయలో 17.2 అనకాపల్లిలో 16.2, కశింకోటలో 15, పరవాడలో 12.4, కె.కోటపాడులో 11.6, పాడేరులో 10.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10మిల్లిమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది. జిల్లాలో రబీ సీజన్లో సరాసరిన సాగు విస్తీర్ణం 35,520 హెక్టార్లు కాగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 26,440 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. రెండున్నరవేల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా, 17వేల హెక్టార్లలో అపరాలు,7,300 వేల హెక్టార్లలో వలిసలతో పాటు మొక్కజొన్న తదితర సాగవుతు న్నాయి. వరిపంటయితే ప్రస్తుతం 75 శాతం వరకు కోతలయ్యాయి. 25 శాతం పంట ఇంకా చేలల్లోనే ఉంది. కోతలు పూర్తయినా నూరుశాతం నూర్పులు జరగలేదు. మొన్నటి వడగండ్ల వానకే చాలా చోట్ల పంటలు నేరకొరిగాయి. శుక్రవారం తాజాగా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2వేలఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్టుగా జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. మరో 500 ఎకరాల్లో ఇంకా నీరు నిలబడిపోయినట్టు చెబుతున్నారు. మొక్క జొన్న, చోళ్లు, అపరాలపంటలు మరో మూడువేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో మాడుగుల, నక్కపల్లి, అరకులోయ, చోడవరం, పాడేరు తదితర ప్రాంతాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లగా, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటి నష్టాన్ని కల్గించాయి. అరకులోయ మండలంలో చినలబుడు పంచాయతీలో వేసిన సుమారువంద ఎకరాల్లో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే మండలంలోని శిమిలిగుడ మిని రిజర్వాయర్‌కు తలుపులు వేయక పోవడంతో కొత్తభల్లుగుడ, గద్యగుడ, శిమిలిగుడ గ్రామాల్లో సుమారు 25 ఎకరాల వరి పంటలు కొట్టుకు పోయినట్టుగా రైతులు చెబుతున్నారు. హుకుంపేట మండలంలో రబీలో వేసిన 630 హెక్టార్ల వరిపంట నీట మునిగింది. భీమిలి డివిజన్లో 250 హెక్టార్లలో మొక్క జొన్న,40 హెక్టార్లలో చోడి పంటలు దెబ్బతిన్నాయి. మాడుగుల 12వేల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా తాజా వర్షానికి సగానికైపైగా పంటలు నీళ్లపాలయ్యాయి. మాడుగుల నియోజకవర్గ పరిధిలోనే మొన్నటి వడగండ్ల వానకు 500ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ఈరోజు కురిసిన వర్షాలకు మరో 1000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 400 ఎకరాల్లో నువ్వుల చేనులు కూడా ఉన్నాయి. అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలకు ఏడు మేకలు, రెండు పశువులు కూడా మృత్యువాత పడ్డాయి.చేతికందివచ్చే సమయంలో కురిసిన భారీవర్షాలకు రైతులు విలవిల్లాడి పోతున్నారు. మరో రెండురోజులు ఇదే రీతిలో వర్షాలు కురిస్తేమాత్రం ముంపునకు గురైన పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. నక్కపల్లిలో 8 సెంటీమీటర్ల నక్కపల్లి: నక్కపల్లిలో శుక్రవారం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం పడటంతో జాతీయ రహదారితోపాటు, పట్టణంలో వీధులన్నీ జలమయమయ్యాయి. ఎనిమిది సెంటీమీటర్ల (88.86మిల్లీమీటర్ల ) వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది ఇంతవరకు ఇంత భారీ వర్షం పడలేదు. నక్కపల్లి ఏరియా ఆస్పత్రి, తహశీల్దార్కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలలో అధికంగా నీరు చేరింది. పట్టణంలో బండారుపేట, కొత్తపేట, వీవర్స్‌కాలనీ, వెంకటనగర్కాలనీలతోపాటు ప్రధాన వీధులు రోడ్లుపై నుంచి నీరు ప్రవహించింది. జాతీయ రహదారిపై కూడా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కొద్దిగా ఇబ్బందిగా మారింది. నక్కపల్లితోపాటు పాయకరావుపేట పట్టణంలో కూడా భారీ వర్షం పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.